స్టాలిన్‌తో న్యాయవాద సంఘం నేతల భేటీ | - | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌తో న్యాయవాద సంఘం నేతల భేటీ

Sep 12 2026 12:36 AM | Updated on Sep 12 2026 12:36 AM

సాక్షి, చైన్నె : చైన్నె జార్జ్‌ టౌన్‌ కోర్టు న్యాయవాద సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన న్యా యవాదులు శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను తేనాంపేటలోని పార్టీ కార్యాలయం అన్నా అరివాలయంలో కలిశారు. వారిని స్టాలిన్‌ అభినందించారు. ఆయనను కలిసిన వారిలో పి.విజయ్‌కుమార్‌(అధ్యక్షుడు), ఇ.అశోక్‌కుమార్‌ (కార్యదర్శి), హెచ్‌.కరుణాకరన్‌ (ఉపాధ్యక్షుడు), ఎ.టి.కిశోర్‌ కుమార్‌ (ఉప కార్యదర్శి), ఎం.విజయరాఘవన్‌ (కోశాధికారి), కె.రత్నవల్లి (జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌), వి.కార్తీక్‌ (మద్రాస్‌ హైకోర్టు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌) ఉన్నారు. వారిని స్టాలిన్‌ సత్కరించారు. కార్యక్రమంలో డీఎంకే ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌.భారతి, లీగల్‌ వింగ్‌ సెక్రటరీ సీనియర్‌ అడ్వకేట్‌ ఎన్‌.ఆర్‌.ఇలంగో తదితరులు పాల్గొన్నారు.

ఇమాన్యువల్‌ శేఖరన్‌కు శ్రద్ధాంజలి

సాక్షి, చైన్నె : స్వాతంత్య్ర సమరయోధుడు, సమత్తువ పోరాటయోధుడు ఇమాన్యువల్‌ శేఖరన్‌ 69వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన త్యాగాలను స్మరిస్తూ తమిళనాడు మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ తదితర పలువురు ప్రముఖులు స్మారకం వద్దకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. రామనాథపురం జిల్లా పరమకుడిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ స్తూపం వద్ద ప్రభుత్వం తరఫున మంత్రులు నిర్మల్‌కుమార్‌, అరుణ్‌రాజ్‌, ప్రముఖ రాజకీయ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయ నిధి స్టాలిన్‌ మాట్లాడుతూ ఇమాన్యువల్‌ శేఖరన్‌ చేసిన త్యాగాలు, పోరాటాలను కొనియాడారు. సీఎం విజయ్‌ తరపున మంత్రులు స్పందిస్తూ ఇమాన్యువల్‌ శేఖరన్‌ చిరస్మరణీయుడని కొనియాడారు.

185 మంది రౌడీల అరెస్టు

సాక్షి, చైన్నె : చైన్నెలో ఇటీవల జరిగిన వరు స హత్యలను చైన్నె నగర పోలీసులు సీరి యస్‌గా తీసుకున్నా రు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీమూకలపై ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా ఆపరేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో ఒక్క రాత్రిలో 185 మంది రౌడీలను అరెస్టు చేశారు. చైన్నె బీసెంట్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన టీవీకే నాయకుడు కన్నన్‌, తిరువొత్తియూరులో సహాయ నటుడు ప్రదీప్‌ రాజ్‌, ఇలా గత వారంలో పలు హత్యలు జరిగాయి. ఐదు రోజుల వ్యవధిలో జరిగిన పలు హత్యలతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసు కమిషనర్‌ అమల్‌రాజ్‌ సీరియస్‌ అయ్యారు. ఆపరేషన్‌ స్పెషల్‌ రైడ్‌కు ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ముమ్మర దాడులు చేపట్టారు. వివిధ నేర కేసుల్లో ప్రమేయం ఉన్న 185 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ అమల్‌రాజ్‌ మాట్లాడుతూ ప్రజల శాంతికి భంగం కలిగించే వారు, నేర కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

స్తంభించిన బ్యాంకింగ్‌ సేవలు

సాక్షి, చైన్నె : ప్రధాన డిమాండ్ల సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు శుక్రవారం సమ్మెకు దిగారు. దీంతో బ్యాంకింగ్‌ సేవలు స్తంభించాయి. శని, ఆది, సోమవారాలు సెలవులు రావడంతో నాలుగు రోజులు బ్యాంకింగ్‌ సేవలు స్తంభించినట్టు అయింది. వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని, అన్ని శనివారాలను సెలవు దినాలు గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 వేల బ్యాంకు శాఖల్లో 60 వేల మంది ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పలు ప్రైవేట్‌ బ్యాంకుల ఉద్యోగులు కూడా పాల్గొనడంతో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

నిలిచిపోయిన లావాదేవీలు

బ్రాంచ్‌ మేనేజర్లు సహా అధికారులు కూడా సమ్మెలో పాల్గొనడంతో చాలా శాఖలు మూతపడ్డాయి. దీంతో రూ.కోట్ల లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సి.హెచ్‌.వెంకటాచలం మాట్లాడుతూ ప్రతి శనివారం సెలవు దినంగా అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే సెప్టెంబర్‌ 28, 29, 30 తేదీల్లో అఖిల భారత సమ్మె చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement