ట్రాన్స్‌ఫార్మర్‌ కొనుగోలులో స్కాం! | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ కొనుగోలులో స్కాం!

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

● మేట్టూరులోని 3 ప్రైవేట్‌ సంస్థల్లో విజిలెన్స్‌ దాడులు ● రాష్ట్రవ్యాప్తంగా 41 చోట్ల సోదాలు ●ప్రభుత్వానికి బీజేపీ హితవు ●ఒకే కూటమిగా సీమాన్‌, కృష్ణస్వామి, వేల్‌ మురుగన్‌

● మేట్టూరులోని 3 ప్రైవేట్‌ సంస్థల్లో విజిలెన్స్‌ దాడులు ● రాష్ట్రవ్యాప్తంగా 41 చోట్ల సోదాలు

సాక్షి, చైన్నె: ట్రాన్స్‌ఫార్మర్‌ కొనుగోలు ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై మేట్టూరులోని మూడు ప్రైవేట్‌ సంస్థల్లో విజిలె న్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ అధికారులు విస్తృత తనిఖీలను బుధావారం నిర్వహించారు. తమిళనాడు విద్యుత్‌ బోర్డులో ట్రాన్స్‌ఫార్మర్లకు అవసరమైన కండక్టర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. రూ. 397 కోట్లతో 43800 ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు అక్రమాల పుట్టగా విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. దీంతో విజిలెన్స్‌ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చైన్నెతో పాటుగా పలు ప్రాంతాల్లో 41 చోట్ల దాడులు నిర్వహించారు.

గత ప్రభుత్వ హయాంలో సరఫరాలు

మేట్టూరు సమీపంలోని సిడ్కో, కుంజండియూర్‌, కోనూర్‌లలో ఉన్న మూడు ప్రైవేట్‌ కండక్టర్ల కంపెనీల నుండి గత ప్రభుత్వ హయాంలో ట్రానన్స్‌ ఫార్మర్ల తయారీకి కావలసిన పరికరాలను సరఫరా చేశారు .దీంతో బుధవారం ఉదయం 8 గంటల నుండి ఆ మూడు సంస్థల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్లు నరేంద్రన్‌, నల్లాంమాళ్‌, రవికుమార్‌ నేతృత్వంలో 15 మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. దాడుల సమయంలో ఆయా సంస్థలకు సంబంధించిన ఆన్‌లైన్‌ ఆర్థిక లావాదేవీలు, కీలక పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు పొద్దుపోయే వరకు కొనసాగాయి. చైన్నెతో పాటుగా 41 చోట్ల విస్తృతంగా సాగిన సోదాలలో కీలక రికార్డులు బయటపడిటనట్టు సమాచారాలు వెలువడ్డాయి.

సినిమా రాజకీయాన్ని వీడండి!

సాక్షి, చైన్నె: సినిమా తరహా రాజకీయాన్ని పక్కనపెట్టి తమిళనాడు ప్రభుత్వం నిర్మాణాత్మకమైన ప్రజా సేవ, క్షేత్రస్థాయి పనులపై దష్టి సారించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ హితవు పలికారు. చైన్నె పల్లావరంలో బీజేపీ నేతృత్వంలో వక్తల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌, ఇన్‌చార్జ్‌ అరవింద్‌ మీనన్‌, కో– ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తదితర పార్టీ నిర్వాహకులు హాజరయ్యారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ, క ర్ణాటక సరిహద్దులో ముగ్గురు తమిళులను కాల్చిచంపడం మానవత్వానికి మచ్చగా పేర్కొన్నారు. కావేరి నీటి విడుదల విషయంలోనూ, సరిహద్దు ప్రాంతాల్లో తమిళుల భద్రత విషయంలోనూ కర్ణాటక ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదన్నారు. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన అందిస్తున్నామని తమిళనాడు ప్రభుత్వం చెబుతోందని,అ యితే, ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ పనుల టెండర్లలో అవకతవకలు జరిగాయని కథనాలు వస్తున్నాయన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలనిడిమాండ్‌ చేశారు. తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ, సిద్ధాంతం, బలమైన వ్యవస్థ ఆధారంగా 365 రోజులూ పనిచేసే పార్టీ బిజేపీ అని వ్యాఖ్యలు చేశారు. తమది వ్యక్తి కేంద్రీకృత పార్టీ ఏ మాత్రం కాదన్నారు.

కొత్త సమీకరణాలు

సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయ రంగంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా సీఎం విజయ్‌ నేతృత్వంలోని పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించింది.అధికారపగ్గాలుసైతం చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో, రాబోయే శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్రంలో ఒక కొత్త పొత్తు చిగురిస్తోంది. సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి, డాక్టర్‌ కృష్ణ స్వామి నేతృత్వంలోని పుదియ తమిళగం వేల్‌ మురుగన్‌ నేతృత్వంలోని తమిళగ వాళ్వురిమై కట్చిలు కూటమిగా ఏర్పాడేందుకు సిద్దమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు చర్చలు విఫలం కావడం, విడివిడిగా పోటీ చేయడం వల్ల ఆశించిన ఫలితాలుఈ పార్టీలకు రాలేదు. దీంతో రాబోయే ఉప ఎన్నికల్లో ఈ నాయకులందరూ కలిసి కొత్త కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. మరిన్ని చిన్న పార్టీలన్నీంటిని ఏకం చేసే దిశగా ఈకూటమి ఆవిర్భావం త్వరలో జరగబోతున్నట్టు చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement