10 జిల్లాల్లో.. 10 రోజుల్లో.. 10 ప్రాజెక్టులు..! | - | Sakshi
Sakshi News home page

10 జిల్లాల్లో.. 10 రోజుల్లో.. 10 ప్రాజెక్టులు..!

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

● రూ. 300 కోట్ల పెట్టుబడి

సాక్షి, చైన్నె : చైన్నెకి చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సమీరా గ్రూప్‌ తమిళనాడు రియల్‌ ఎస్టేట్‌ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ‘‘10 జిల్లాల్లో.. 10 రోజుల్లో.. 10 ప్రాజెక్టులు’’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్టు 23 నుండి సెప్టెంబర్‌ 1, 2026 మధ్య రాష్ట్రవ్యాప్తంగా విల్లాలు, నివాస స్థలాలతో కూడిన 10 ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించనుంది. రూ 300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నట్టు ఆసంస్థ ఎండీలు జయకుమార్‌ మురుగేశన్‌, ఎమ్‌. సందీప్‌ కుమార్‌ , పాన్‌ ఇండియా ఆపరేషన్స్‌ సీఈఓ డి. సెంథిల్‌ వేలన్‌ ప్రకటించారు. ఈ కొత్త ప్రాజెక్టులు తిరుచ్చి, మధురై, తిరునెల్వేలి, వేలూరు, రాణిపేటై, కాంచీపురం, చైన్నె, కృష్ణగిరి, తిరువణ్ణామలై చెంగల్పట్టు జిల్లాల్లో ఉన్నట్టు వివరించారు. తమిళనాడులోని ప్రధాన నగరాల్లో వ్యవస్థీకృత నివాస స్థలాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికే ఈ ప్రాజెక్టులను రూపొందించామన్నారు. ప్లాట్లు, విల్లాలతో పాటు గేటెడ్‌ వాతావరణం, పార్కులు, కమ్యూనిటీ మౌలిక సదుపాయాలను అందిస్తున్నాం. కస్టమర్లకు నాణ్యమైన జీవన వాతావరణంతో పాటు దీర్ఘకాలిక ఆస్తి విలువను అందించడమే మా ముఖ్య లక్ష్యంగా వివరించారు. ఈ 10–10–10 ప్రచారం తమిళనాడుతో ప్రారంభమవుతోందని, భవిష్యత్తులో ఈ అనుభవంతో భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలు, రాష్ట్రాలకు కూడా విస్తరణ కసరత్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement