అమ్మ నా వాట్సాప్‌ను బ్లాక్‌ చేసింది..! | - | Sakshi
Sakshi News home page

అమ్మ నా వాట్సాప్‌ను బ్లాక్‌ చేసింది..!

Aug 1 2026 12:54 AM | Updated on Aug 1 2026 12:54 AM

తమిళసినిమా: ఒకప్పుడు యువతులు సినిమా రంగంలోకి రావడానికి భయపడేవారు. వారి కుటుంబ సభ్యులకు కూడా అనుమతించే వారు కాదు. అయితే ఆ పరిస్థితి రాను రాను పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని వర్గాలకు చెందిన మహిళలు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే చిత్ర పరిశ్రమ గురించి సదాప్రాయం లేని వారు ఉన్నారంటే అది ఆశ్చర్యమే. నటి భాగ్యశ్రీ బోర్సే కుటుంబం ఈ కోవకు చెందినదే. తెలుగు చిత్రం మిస్టర్‌ బచ్చన్‌ తో సినీ రంగ ప్రవేశం చేసిన నటి ఈ బ్యూటీ. ఆ తరువాత కింగ్‌ డామ్‌ చిత్రం ( అనువాదం) తో కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు ఆ తర్వాత దుల్కర్‌ సల్మాన్‌ కు జంటగా నటించిన కాంత చిత్రం కూడా నిరాశపరిచింది. అయితే ఆ చిత్రంలో నటి భాగ్యశ్రీ బోర్సే నటన అందర్నీ ఆకట్టుకుంది. ఏదేమైనా చిత్రాలు సక్సెస్‌ అయితేనే అందులో నటించిన హీరో హీరోయిన్లకు నేమ్‌ ఫేమ్‌ వస్తుంది. అలా ఐరన్‌ లెగ్‌ నటిగా ముద్ర వేసుకున్న ఈ అమ్మడు ఇటీవల తెలుగులో నటించిన లెనిన్‌ చిత్రం సక్సెస్‌ తో ఆ ముద్రను చెరిపేసుకున్నారు. అయితే ఈమెకు క్రేజీ అవకాశాలు మాత్రం తలుపు తడుతూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం నటుడు శివకార్తికేయన్‌ కు జంటగా సెయోన్‌ చిత్రంలో నటిస్తున్నారు. కాగా నటి భాగ్యశ్రీ బోర్సే తన సినీ రంగ ప్రవేశం గురించి ఇటీవల ఒక భేటీల పేర్కొంటూ ‘‘తను సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు మా కుటుంబంలో ఒక్కరు కూడా సమ్మతించలేదు. ముందుగా నా నిర్ణయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె ససిమేరా వద్దు అని చెప్పారు. నాన్నను అడిగాను. ఆయన అమ్మ వద్దంటుంది కదా అని చెప్పారు. నాకు సోదరి అయిన సపోర్ట్‌ చేస్తుందని భావించాను. తను కూడా పూర్తిగా వ్యతిరేకించింది. సినిమా రంగం తమ కూతురికి సురక్షితం కాదు అన్నది వారి నిరాకరణకు కారణం. అయినా నా కలను నెరవేర్చుకోవడానికి సినిమాలో నటించడానికే ముందడుగు వేశాను. నేను మొదటిసారిగా అడిషన్‌ కు వెళ్లినప్పుడు మా అమ్మ కోపంతో నా వాట్సాప్‌ ను బ్లాక్‌ చేసింది. అంతేకాకుండా ఆ తర్వాత ఆరు నెలలు ఆమె నాతో మాట్లాడలేదు. అయినా నేను నటిగా ఉన్నత స్థాయికి ఎదిగినప్పు డు వారు నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారులే అనే నమ్మకంతో సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యాను. కాగా జీవితంలో ఎవరికి సంశయభావం ఉండకూడదు. ఏం చేయాలని అని పిస్తుందో అది చే యండి’’ అని నటి భాగ్య శ్రీ బోర్సే పేర్కొన్నారు.

భాగ్యశ్రీ బోర్సే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement