క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 1 2026 12:55 AM | Updated on Aug 1 2026 12:55 AM

● పాడి తిరువల్లీశ్వరర్‌

రూ.85 లక్షలతో

ఆలయానికి రథం

ఆలయ రథానికి ప్రత్యేక పూజ

కొరుక్కుపేట: పాడిలోని ప్రసిద్ధ గురు స్థలాల్లో ఒకటైన పాడి తిరువల్లీశ్వరార్‌లో ఉన్న ఆలయా న్ని రూ.85 లక్షలతో రథాన్ని తయారు చేయించారు. ఈ ఆలయానికి వందేళ్ల చరిత్ర ఉంది. చిత్తిరై మాసంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి రథం లేదు. రథాన్ని నిర్మించాలని భక్తులు అనేక ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో రూ.85 లక్షలతో కొత్త చెక్క రథం, ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. దీన్ని అంబత్తూరు ఎమ్మెల్యే జి.బాలమురుగన్‌, హిందూ మత ధర్మాధినేతల శాఖ జాయింట్‌ కమిషనర్‌ మోహన సుందరం, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎ.కుమారన్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌ వనవిల్‌ విజయ్‌ శుక్రవారం ప్రారంభించారు. స్వామి ఆలయం లోపలి అలంకరణ కోసం రూ.3.5 లక్షలతో నిర్మించిన చిన్న రథంలో శుక్రవారం స్వామిని ఊరేగించారు. అలాగే భక్తుల కోసం రూ.3 లక్షలతో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

వేంబులి అమ్మవారికి

ప్రత్యేక పూజలు

తిరువళ్లూరు: తిరువళ్లూరు గ్రామదేవత వేంబు లి అమ్మవారికి శుక్రవారం ఉదయం ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతిఏటా ఆషాడమాసంలో శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే మూ డవ శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేశారు. ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే పెద్ద పాళ్యం భవానీ అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి పొంగళ్లు పెట్టారు. పుట్లూరు భవానీ అమ్మవారి ఆలయంలోనూ పూజలు, అభిషేకం చేశారు. తిరువేర్కాడు అమ్మవారి ఆలయంలోనూ భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకున్నారు.

మాజీ ప్రియురాలి పేరుతో పచ్చబొట్టు

– చితకబాధిన భార్య బంధువులు

తిరువళ్లూరు: మాజీ ప్రియురాలి పేరును పచ్చబొట్టు వేసుకున్న భర్తను భార్యతో పాటు ఆమె బంధువులు చితకబాదిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. తేని జిల్లా బోడినాయక్కనూరు ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్‌(36) శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య అర్చన, కుమారుడు వున్నారు. ప్రస్తుతం వీరు తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో నివా సం వుంటున్నారు. రెండు రోజుల క్రితం వినోద్‌కుమార్‌ తన మొదటి ప్రియురాలి పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. విషయాన్ని భార్య అర్చన గుర్తించి అతడితో ఘర్షణపడింది. అనంతరం అర్చన తన అక్క వనతి, భావ శరవణన్‌, సోదరుడు మహేష్‌ను పిలిపించింది. వారు వినోద్‌కుమార్‌ను చితకబాదారు. తీ వ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు రక్షించి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

విశ్రాంత ఉద్యోగుల ధర్నా

తిరుత్తణి: డిమాండ్ల పరిష్కారం కోసం విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. వారు శుక్రవారం తిరుత్తణి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇందులో 502 మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు రామకృష్ణన్‌ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు ఇన్సూరెన్స్‌ పాలసీలో వున్న లొసుగులు తొలగించాలని, ఇన్సూరెన్స్‌ పాలసీని విశ్రాంత ఉద్యోగులందరికీ అందుబాటులో చూడాలన్నారు.

బాలికల వసతి గృహం తనిఖీ

తిరుత్తణి: తిరుత్తణిలోని కేకే.నగర్‌లో ఉన్న ప్రభు త్వ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం బీసీ వెల్ఫేర్‌ శాఖ మంత్రి సంపత్‌కుమార్‌ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న బాలికలతో మాట్లాడారు. ఆహారం నాణ్యత గురించి తెలుసుకున్నారు. తాగునీరు., ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. 60 మంది బాలికల పేర్లు పట్టికలో వున్నా పది మంది మాత్రమే హాజరుకావడంపై వార్డెన్‌ను ప్రశ్నించారు. అలాగే విద్యార్ధినులకు సరఫరా చేస్తున్న సబ్బులు, ఇతర వస్తువులు కాలం చెల్లినట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement