అన్నాడీఎంకే కూటమికితిరుగులేదు..! | - | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే కూటమికితిరుగులేదు..!

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

● రాష్ట్రంలో మైనారిటీలు మా వెన్నంటే ● వాగ్దానాలను ఉచితం అనకూడదు ● ఢిల్లీ జోక్యం ఏమీ లేదు ● అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి

సాక్షి, చైన్నె : Æ>çÙ‰…ÌZ AòÜ…-½Ï G°²MýSÌS {ç³^éÆý‡… gZÆý‡$V> ÝëVýS$-™ø…-¨. {糫§é¯]l ´ëÈ-t±² ¯]l$ÐéÓ ¯ól¯é A¯ól ȆÌZ {ç³^éÆý‡… ÝëW-çÜ$¢-¯é²Æý‡$. ™égêV> G°²-MýSÌZÏ A¯é²yîl-G…MóSే MýS*rÑ$ Ð]lNÅà-Ë$.. àÒ$-ÌSOò³ A¯é²-yîl-G…MóS {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ ç³âýæ-×ìæ-ÝëÓÑ$ çܵ…¨…^éÆý‡$. Ò$yìl-Ķæ*™ø ÑÑ«§ýl A…Ô>-ÌSOò³ BĶæ$¯]l AÀ-{´ë-Ķæ*-ÌS¯]l$ ™ðlÍ-Ķæ$-gôæ-Ô>Æý‡$.. ""2009ÌZ fÇW¯]l †Æý‡$Ð]l$…VýS-âýæ…ÌZ Eç³-G-°²MýS 糯]l$ÌZÏ ™èl¯]l™ø ´ër$V> Mö…§ýlÆý‡$ °Æ>Ó-çßæMýS$-ÌS¯]l$ AÐ]l$à fĶæ$-ÌS-Í™èl ç³…í³…-^éÆý‡° ÑÐ]l-Ç…-^éÆý‡$. JMýSÆøk AÐ]l$à í³Í_, A…§ýl-Ç-±... °Äñæ*-f-MýSÐ]l-Æý‡Y…ÌZ ç³Çíܦ† GÌê E…§ýl° Ayìl-W¯]lr$t õ³ÆöP-¯é²Æý‡$. A…§ýlÆý‡$ ¯ól™èlË$ A§ýl$Â-™èl…, VðSË$ç³# Ð]l$¯]l§ól A° Ç´ùÆŠ‡t CÐ]lÓV>, ™é¯]l$ Ð]l*{™èl… MýSçÙt… A° çÜÐ]l*-«§é¯]l… C^éa¯]l° VýS$Æý‡$¢ ^ólÔ>Æý‡$. D çÜÐ]l$Ķæ$…ÌZ CMýS ç³âýæ×ìæ ÝëÓÑ$ ç³° AƇ$$-´ù-Ƈ$$…§ýl° A…§ýlÆý‡* ¿êÑ…^éÆý‡-°, AƇ$$™ól, ™é¯]l$ ^ðlí³µ¯]l-r$t-V>¯ól çœÍ™èl… Æ>Ð]l-yýl…™ø AÐ]l$à í³Í_ AÀ¯]l…-¨…-^éÆý‡° ™ðlÍ-´ëÆý‡$. °gêÆ‡$$-¡V>, O«§ðlÆý‡Å…V> °gê°² ^ðlí³µ ¯]l…§ýl$MýS$ V>¯]l$ ™èl¯]l Ò$§ýl ¯]lÐ]l$ÃMýS… AÐ]l$ÃMýS$ ò³Ç-W…§ýl° õ³ÆöP¯é²Æý‡$. B °gê-Ƈ$$¡, O«§ðlÆý‡Å… ™égêV> D Ýë¦Æ‡$$MìS ^ólÇa…-§ýl-°'' A¯é²Æý‡$.

తమను తీర్చిదిద్దిన పురట్చి తలైవర్‌ (ఎం.జి.ఆర్‌) బోధించిన, ‘కష్టపడి పనిచేసేవారే గొప్పవారు’ అనే సిద్ధాంతాన్ని అనుసరించి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా 50 ఏళ్లకు పైగా పనిచేసిన ఫలితంగా పార్టీ సహచరులు నాకు ఈ హోదాను బహుమతిగా ఇచ్చారన్నారు. వారి నమ్మకాన్ని కాపాడే విధంగా కృషి చేస్తానని.. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను అని పేర్కొన్నారు. ఏదైనా ఒక పార్టీ నాయకత్వం, ఉద్యమం క్రమశిక్షణతో, నియంత్రణతో సాగాలని కోరుకుంటుంది. మా రాజకీయ గురువు అరిజ్ఞర్‌ అన్నా ’కర్తవ్యం – గౌరవం – క్రమశిక్షణ’ను బోధించారు. ఆయన మార్గంలోనే ఎం.జి.ఆర్‌, జయలలిత నడిచారు. నేను కూడా వారు చూపిన బాటలోనే పయనిస్తున్నాను. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి ద్రోహం చేసిన వారిపై జనరల్‌ బాడీ సమావేశంలో చర్యలు తీసుకున్నాము. ఇక్కడ ఉన్నంత కాలం పదవులను అనుభవించి, పార్టీకి ద్రోహం చేయడమే కాకుండా, స్వలాభం కోసం వారు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దాని గురించి మేము ఆందోళన చెందాలా? అని పేర్కొన్నారు.

కూటమి అనేది ఎన్నికల పరిస్థితులను బట్టి ఏర్పడుతుంది. 1999లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన అన్నాడీఎంకే, 2004లో మళ్లీ జత కట్టింది. 1999లో బీజేపీతో చేరిన డీఎంకే, 2004లో అక్కడి నుండి విడిపోయి కాంగ్రెస్‌తో చేరింది. తమిళనాడులోని దుష్టశక్తి అయిన డీఎంకే పాలనను అంతం చేయాలనే ఏకై క లక్ష్యంతో అన్నాడీఎంకే, బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇందులో ఢిల్లీ ఒత్తిడి అనేది ఊహ మాత్రమే. అమ్మ మరణం తర్వాత నిజమైన, విశ్వాసపాత్రులైన కార్యకర్తలు ఒక సామాన్య కార్యకర్తగా, కష్టపడే వ్యక్తిగా ఉన్న నాకు మద్దతు ఇచ్చారు. పార్టీని తాకట్టు పెట్టిన వారిని, ద్రోహం చేసిన వారిని గుర్తించి ‘కలుపు మొక్కలను తొలగించి పార్టీని కాపాడుకున్నాం. శత్రువులతో పోరాడుతున్నాం, క్షేత్రస్థాయిలో విజయం సాధించడం ఖాయం అని స్పష్టం చేశారు.

మణిపూర్‌ విషయంలో మేం సరైన రీతిలో గళం విప్పాం. సీఏఏ చట్టం వల్ల భారతీయ ముస్లింలకు, ముఖ్యంగా తమిళనాడు ముస్లింలకు ఎటువంటి నష్టం లేదని నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అసెంబ్లీలో స్పష్టంగా చెప్పాను. సీఏఏ వల్ల ముస్లింలకు కలిగే నష్టం ఏంటో ఆధారాలతో చెబితే నేను సమాధానం ఇస్తాను. ఓట్ల కోసం తమను ఆదరించేది ఎవరు, నిజంగా తమ సంక్షేమం కోసం పాటుపడేది ఎవరు అనేది తమిళనాడులోని ముస్లిం సోదరులకు బాగా తెలుసు. ఈ ఎన్నికల్లో వారు పూర్తి ఇష్టంతో అన్నాడీఎంకేకు ఓటు వేస్తారనే నమ్మకం మాకు ఉంది. సోనియా గాంధీని, రాహుల్‌ గాంధీని సిద్ధాంతకర్తలుగా అంగీకరించి వారికి ఎంకే స్టాలిన్‌ సలాం కొడుతారేమోగానీ, తమ వరకు ఆదర్శ నాయకులు ఎవరో ప్రజలకు బాగా తెలుసని అభిప్రాయపడ్డారు.

రాజకీయంలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ విజయ్‌ టీవీకే వారికీ ఉందంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం అని స్టాలిన్‌ కుటుంబం విదేశాలకు విహారయాత్రకు వెళ్లి వచ్చిందని మరో ప్రశ్నకు ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌తో దొంగ, బోగస్‌ ఓట్లను తొలగించారని ఇంకో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా విమానాశ్రయం నిర్మించాలన్నదే అప్పుడూ, ఇప్పుడూ తమ విధానం అని పరందూరు విషయంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వాగ్దానాలను ఉచితం అని అనకండి. లేనివారికి, లేని పక్షంలో ఉన్నవారికి కుటుంబ అవసరాలకు కావాల్సినవి వెల లేకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆ ప్రాతిపదికన ఫ్రిడ్జ్‌ ఇస్తామని చెప్పాం. అన్ని కుటుంబ కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 జమ చేస్తామని హామీ ఇచ్చాం. పేద , మధ్యతరగతి ప్రజలు తమకు ఓటు వేయడానికి ఇప్పటికే సిద్ధమైపోయారు. గెలుపు తమదే, అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు.

జన కెరటం

వారికి స్వేచ్చ ఉంది!

మైనారిటీలు మా వెన్నంటే..

బీజేపీతో పొత్తుపై..

వ్యక్తిగత విమర్శలు చేయను

ఇటీవల ప్రసంగాలలో వ్యక్తిగత విమర్శలు తీవ్రంగా ఉన్నట్టుందే ? అని సూచించగా, తాను ఎప్పుడైనా మర్యాద లేకుండా మాట్లాడటం చూశారా?, ఎవరైనా సరే వారు అని గౌరవంగా సంబోధించడమే నా పద్ధతి అని వ్యాఖ్యలు చేశారు. అయితే, అనవసరంగా గొడవకు దిగితే ఎలా వదలగలను? లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ అన్నాడీఎంకే, ఊరికే వదిలేస్తే నా గురించి కార్యకర్తలు ఏమనుకుంటారు? అని ప్రశ్నించారు.

కష్ట పడి పనిచేసే వారే గొప్పవారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement