సాక్షి,చైన్నె: ప్రముఖ పాల్సన్ బ్యూటీ అండ్ ఫ్యాషనన్స్ ఆధ్వర్యంలో చైన్నె కీల్పాక్కంలో పింక్ పోటాటోను ఏర్పాటు చేశారు. దీనిని క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ సతీమణి ఉత్కర్ష, క్రికెటర్ శ్రేయాస్ గోపాల్ సతీమణి నిఖిత శివ్, సీఎస్‌కే ఫీల్డింగ్ కోచ్ రాజీవ్ కుమార్ సతీమణి రెబెకా అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్సన్ బ్యూటీ ఫ్యాషన్‌న్స్ ఎండీ డాక్టర్ శామ్ పాల్, అశ్విని శామ్ పాల్, ప్రసాద్ బలరామన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పింక్ పొటాటో లో నోరూరించే హరా భరా కబాబ్, భేల్ పూరి, పన్నీర్ టిక్కా, బీట్రూట్ సూప్, హమ్మస్ వంటి ఆకర్షణీయమైన స్టార్టర్లు, ప్రధాన వంటకాలను అందిస్తున్నట్టు డాక్టర్ శ్యామ్‌పాల్ తెలిపారు.


