క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

విజయ్‌ మంచి నటుడే కానీ..

తిరువళ్లూరు: టివీకే ఽఅధినేత విజయ్‌ మంచి నటుడని అయితే రాజకీయంగా ఆయన పనికి రారని సినీనటి నళినీ స్పష్టం చేశారు. తిరువళ్లూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్దిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్‌కు మద్దతుగా తిరువళ్లూరు పట్టణంలోని వేర్వేరు ప్రాంతాలతో పాటు అధిగత్తూరు, వెంగత్తూరు, మన వాలనగర్‌ తదితర ప్రాంతాల్లో నళినీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నళినీ మాట్లా డుతూ టివీకే అధినేత విజయ్‌ మంచి నటుడని, ఆయనకు మంచి ఫాలోయింగ్‌ కూడా వుందని స్పష్టం చేశారు. విజయ్‌కు వున్న క్రేజ్‌తోనే ఆయననూ చూడడానికి భారీగా జనం తరలివస్తున్నారని వ్యాఖ్యానించిన అయితే సభలకు వచ్చిన జనం ఓటు వేయరన్నారు. ఇంధిర విద్యాసంస్థల అదినేత్రి ఇంధిరరాజేంద్రన్‌, తిరువళ్లూరు డిఎంకే కార్యదర్శి రవిచంద్రన్‌, మున్సిపల్‌ చేర్‌పర్సన్‌ ఉధయమలర్‌ పాల్గొన్నారు.

డీఎంకేకు ఓటేస్తే...

ఉదయనిధిని సీఎం చేసినట్టే

– పీయూష్‌ ఆసక్తికర వ్యాఖ్య

సాక్షి,చైన్నె : డీఎంకేకు ఓటు వేయడం అంటే ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేయడమే అని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తమిళనాడు సంస్కృతి గౌర వించని ఉదయనిధి స్టాలిన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంద్దామని పిలుపు నిచ్చారు. డిఎంకేకు ఓటు వేయడం అనేది కేవలం ఉదయనిధిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికే ఉపయోగపడుతుందని, ఒకే కుటుంబం పాలన కొనసాగడానికి ప్రజలు అనుమతించకూడదని వ్యా ఖ్యలు చేశారు. మదురైలో ని తమిళనాడు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీలో ఆదివారం పారి శ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పీయూష్‌ గోయల్‌ పాల్గొన్నారు.

అద్వన్నంగా శాంతి భద్రతలు

ఈ కార్యక్రమంలో పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. మహిళలు, పిల్లలకు వ్యతిరేకంగా నేరాలు పెరిగాయని, రౌడీల రాజ్యం నడుస్తున్నదని, డ్రగ్స్‌ మాఫియా రాజ్యమేళుతున్నారని వివరించారు.. శాంతిభద్రతల సమస్య కారణంగా కొత్త పరిశ్రమలు రావడానికి భయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారని గోయల్‌ తెలిపారు.

డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు

తమిళనాడు ప్రభుత్వం కేంద్ర పథకాలను అడ్డు కోవడంలోనే ఆసక్తి చూపుతోందని పీయూష్‌ గోయల్‌ విమర్శించారు.డిఎంకే ప్రభుత్వం కేవ లం కరప్షన్‌ , కమిషన్‌ , కలెక్షన్‌ లకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్టాలిన్‌, ఉదయనిధి, శబరీశన్‌, కనిమొళి వంటి నాయకుల సంఖ్య పెరగడం వల్లే అవినీతి కూడా పెరిగిందని ఆరోపించారు. దివంగత సీఎం జయలలిత తన హయంలో వేసిన పునాదులు నేడు ఫలాలను ఇస్తున్నాయని, ఇందులో డీఎంకే చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.

డాక్టర్‌ టి.వి. రాజాకు

ఎక్సలెన్స్‌ అవార్డు

సాక్షి, చైన్నె: రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మద్రాస్‌ మిడ్‌–టౌన్‌ ప్రతిష్టాత్మకమైన వొకేషనల్‌ ఎక్సలెనన్స్‌ అవార్డును ప్రముఖ ఆర్థోపెడిక్‌ ఫుట్‌ – యాంకిల్‌ సర్జన్‌ డాక్టర్‌ టి.వి. రాజాకు ప్రదానం చేశారు. పాడియాట్రీ (పాదాల వైద్యం) రంగంలో ఆయన సాధించిన విశేష వృత్తిపరమైన విజయాలు, అంకితభావంతో కూడిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్‌, సర్జికల్‌ అనుభవం కలిగిన డాక్టర్‌ టి.వి. రాజా, పాదాలు , చీలమండ శస్త్రచికిత్సలు, డయాబెటిక్‌ ఫుట్‌ (మధుమేహ వ్యాధిగ్రస్తుల పాదాల సమస్యలు) మేనేజ్‌మెంట్‌, ట్రామా కేర్‌ , జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ రంగాలలో విశేష కృషి చేశారు.డాక్టర్‌ టి.వి. రాజా ప్రస్తుతం చైన్నె టి.నగర్‌లోని వీసా మెడిక్యూర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కన్సల్టెంట్‌ ఫుట్‌ సర్జన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా రోటరీ ఆదర్శమైన సర్వీస్‌ అబోవ్‌ సెల్ఫ్‌ (స్వార్థం లేని సేవ)కు నిదర్శనంగా నిలిచినందుకుఈ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.టి.ఎన్‌. జి. ఎడ్విన్‌, వొకేషనల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ఆర్‌.టి.ఎన్‌. వెట్రివేల్‌ రాజన్‌, సెక్రటరీ ఆర్‌.టి.ఎన్‌. ప్రియ సతీష్‌, ఆర్‌.టి.ఎన్‌. ఎన్‌.ఎమ్‌.ఇలంకుమరన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement