అమ్మాయిలతో జాగ్రత్త..! | - | Sakshi
Sakshi News home page

అమ్మాయిలతో జాగ్రత్త..!

Mar 20 2026 8:14 AM | Updated on Mar 20 2026 8:14 AM

నటుడు యోగిబాబు

300వ చిత్రం రెడీ

తమిళసినిమా: చిన్న చిన్న పాత్రల నుంచి ప్రముఖ హాస్యనటుడుగా ఎదిగి ఆ తరువాత కథానాయకుడిగా వెలిగిపోతున్న నటుడు యోగిబాబు. ఈయన 299 చిత్రాలను పూర్తి చేశారు. తాజాగా యోగిబాబు నటించిన 300 నటించిన చిత్రానికి అర్జనన్‌ పేర్‌ పత్తు అనే వ్యత్యాసమైన పేరును నిర్ణయించారు. దేవ్‌ సినిమాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై కతిక తంగపాటి .ఎస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆర్‌ రాజమోహన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన మేర్కు తొడర్చిమలై చిత్రం దర్శకుడు లెనిన్‌ భారతి అసోసియేట్‌ అన్నది గమనార్హం. నటుడు కాళీ వెంకట్‌, అయిలీ మదన్‌ ,సుబ్రహ్మణ్యం శివ, మైనా నందిని, సౌందర్య ,చండ్రాయన్‌ ,హలో కందస్వామి ,పావా లక్ష్మణ్‌ ,రంజన్‌ కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. వీరితోపాటూ దర్శకుడు లెనిన్‌ భారతి ఒక కీలకపాత్రను పోషించారు. డి ఇమాన్‌ సంగీతాన్ని, ప్రదీప్‌ కాళీరాజా ఛాయాగ్రహణంను అందిస్తున్న ఈ చిత్ర టీజర్‌ ను బుధవారం దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. కాగా తాను వాహనాన్ని పోగొట్టుకొని, దాన్ని పొందడం కోసం పోరాడే ఒక యువకుడు, అదే వాహనాన్ని తమదిగా భావించే పలువురు వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో కూడిన చిత్ర టీజర్‌ ఇప్పుడు ప్రేక్షకుల మధ్య మంచి స్పందన పొందుతుందని దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలు పేర్కొన్నారు. ఈ చిత్రం పాత వాహనాలను కొని, విక్రయించే పలు మోసాల గురించి ప్రేక్షకులు తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఇందులో నటుడు యోగిబాబు హాస్యంతో పాటూ భావోద్వేగాలతో కూడిన పాత్రను పోషించారని, చెప్పారు. చిత్ర షూటింగ్‌ పూర్తయిందని ,ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement