క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 12 2026 7:35 AM | Updated on Mar 12 2026 7:35 AM

వేలూరు కోర్టుకు బాంబు బెదిరింపు

వేలూరు: వేలూరు సత్‌వచ్చారిలోని వేలూరు ఉమ్మడి జిల్లాలకు చెందిన కోర్టు ఉంది. ఇందులో జిల్లా, మహి ళా, కార్మికుల కోర్టు, కొనుగోలుదారుల గ్రీవెన్స్‌సెల్‌ కోర్టు, అదనపు కోర్టులు నడుస్తున్నాయి. గత ఏడాది తిరునల్వేలి కోర్టు ఆవరణలో ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులకు పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో వే లూరు కోర్టుకు కూడా ఇద్దరు ఎస్‌ఐలతో కూడిన పోలీ స్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో వేలూరు కోర్టులో బాంబు పెట్టినట్లు బుధవారం ఉదయం పేలుతుందని కోర్టు మెయిల్‌కు సమాచారం వచ్చింది. దీంతో కోర్టు సిబ్బంది వెంటనే బాంబు స్క్వాడ్‌ నిపుణులకు సమాచారం అందజేశారు. వారు కోర్టు వద్దకు చేరుకొని తనఖీలు నిర్వహించారు. అయితే కోర్టు ఆవరణలో ఎటువంటి బాంబు లేకపోవడంతో పోలీసులు, కోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

బాల్య వివాహాలు

జరిగితే చర్యలు

కొరుక్కుపేట: మీంజూరు మున్సిపాలిటీలో బాలల రక్షణ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ రుక్మిణి అధ్యక్షత వహించారు. కార్యనిర్వాహణ అధికారి మహేష్‌ , వైస్‌ చైర్మన్‌ అలెగ్జాండర్‌ పాల్గొన్నారు. రుక్మిణి మాట్లాడుతూ మీంజూరు యూనియన్‌లోని వివాహ మండపంలలో బాల్య వివాహాలు నిర్వహించరాదని, హాటళ్ల లో నోటీసు బోర్డులపై పెట్టాలని తెలిపారు. బాల్య వివాహాలు జరిగితే హాలు యజమానులపై , వివాహం నిర్వహించిన వారు అందరూ దోషులు అవుతారని, పరిహారంగా రూ.లక్ష జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారని తెలిపారు. బాలల రక్షణకు 1098 అనే హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని వెల్లడించారు.

ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

చంద్రగిరి: ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం.. మంగళవారం స్థానిక నాగాలమ్మ ఆలయ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో గుడియాత్తంకు చెందిన తామినాథన్‌(32) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108లో తిరుపతి రుయాకు తరలించారు. బుధవారం ఆయన పరిస్థితి విషమించి మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

కొరుక్కుపేట: క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికే కాకుండా జీవితాన్ని ఉజ్వలంగా మలుచుకోవడానికి ఎంతో దోహదపడుతాయని నటుడు మాపా ఆనంద్‌ అన్నారు . చైన్నెస్‌ అమృత ఏవియేషన్‌ వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌ను స్కై–అథ్లెటికా 2026 పేరుతో బుధవారం నెహ్రూ స్టేడియం వేదికగా నిర్వహించారు. ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ ఆర్‌ భూమినాథన్‌తో కలసి మా పా ఆనంద్‌ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి క్రీడాకారులు 400 మీటర్ల రిలే, జిమ్నాస్టిక్స్‌, సిలంబం వంటి క్రీడలతో ఆకట్టుకున్నారు. విజేతలకు పతకాలు, ట్రోఫీలను అందజేశారు. డీన్‌ అకడమిక్స్‌ తులసిరామ్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాహుల్‌, అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌ శ్రీ అరుణ్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వానికి

ప్రొక్లైనర్‌ వితరణ

వేలూరు: వేలూరు జిల్లాలోని నీటి వనరులను కాపాడేందుకు ప్రభుత్వానికి హుండాయ్‌ కంపెనీ ఎక్స్‌నోరా ద్వారా ప్రొక్లైనర్‌ యంత్రాన్ని వితరణగా ఇవ్వడం అభినందనీయమని జిల్లా రెవెన్యూ అధికకారి శివసుబ్రమణ్యం అన్నారు. చైన్నె హుండాయ్‌ మూవీస్‌ కంపెనీ ఎక్స్‌నోరా ఆధ్వర్యంలో వేలూరు జిల్లాలోని పాలారు, నదులు, చెరువుల్లో పూడిక తీతలతోపాటు ముళ్లచెట్లను తొలగించడానికి రూ.60 లక్షలు విలువ చేసే ప్రొక్లైనర్‌ను వితరణగా అందజేసింది. ఈ యంత్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నదులు, వాగులు, వంకల్లోని వ్యర్థాలను తొలగించడం, ఒడ్డులను శుభ్రం చేయడం, నీటిని నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ యంత్రం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. పాలారు నదిలో ఇటీవల ఎక్స్‌నోరా ఆధ్వర్యంలో ముళ్లచెట్లను తొలగించామన్నారు. ఎక్స్‌నోరా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు ఇటువంటి యంత్రాలను విడతల వారిగా అందజేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. హుండాయ్‌ మూవీస్‌ సోషియల్‌ ఇన్‌చార్జ్‌ అధికారి నరసింహన్‌, ఇన్‌సెంట్‌ సూపర్‌ వైజర్‌ రోషినా, ఎక్స్‌నోరా ఇన్‌చార్జ్‌ వెంకటేష్‌, బాలాజీ, సామాజిక సేవా కర్త దినేష్‌ శరవణన్‌, కార్పొరేటర్‌ సుమతి, వేలూరు ఇన్‌చార్జ్‌ సెంథిల్‌రాజన్‌, నీటి పారుదల శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజినీర్లు, సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement