కలకలం రేపిన బ్లాక్‌బాక్స్‌ | - | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన బ్లాక్‌బాక్స్‌

Mar 12 2026 7:35 AM | Updated on Mar 12 2026 7:35 AM

తిరువళ్లూరు: నిత్యం రద్దీగా ఉండే కలెక్టర్‌ కార్యాలయం వద్ద బ్లాక్‌ బాక్సు కనిపించడం కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద బ్లాక్‌ బాక్సు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, బాంబ్‌స్క్వాడ్‌ సిబ్బంది దాన్ని తెరిచారు. బాక్సులో సీసీ కెమెరా, ఎమర్జెన్సీ అలారం తదితర పరికరాలు ఉండడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. అయితే సీసీ కెమెరాల్లో ఎమైనా రికార్డింగ్‌లు వున్నాయా, ఎమర్జెన్సీ అలారంను ఎక్కడి నుంచి తెచ్చి పడేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

కలెక్టరేట్‌ వద్ద దొరికిన బ్లాక్‌ బాక్స్‌, బాక్స్‌ను పరిశీలిస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement