తిరుత్తణి: ప్లాస్టిక్ రహిత తిరుత్తణి ఆలయానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ప్రతాప్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత తిరువళ్లూరు పథకంలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా కొండ ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డు ప్రవేశ మార్గంలో కాలుష్య నిర్మూలన శాఖ ద్వారా చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వస్తువులు కొండకు తీసుకెళ్లడం నిర్మూలించి భక్తులకు అవగాహన కల్పించి, పసుపు బ్యాగుల పంపిణీ పథకాన్ని కలెక్టర్ ప్రతాప్ బుధవారం ప్రారంభించారు. ఇందులోభాగంగా చెక్‌పోస్టు ప్రారంభించి భక్తులకు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా పసుపు బ్యాగులు పంపిణీ చేశారు. భక్తులు పర్యావరణం కాలుష్యం కాకుండా కొండ పరిశుభ్రత కాపాడే విధంగా అధికారులు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


