ఊలందూరుపేటలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఊలందూరుపేటలో అగ్నిప్రమాదం

Mar 12 2026 7:35 AM | Updated on Mar 12 2026 7:35 AM

తిరువొత్తియూరు: కళ్లకురిచ్చి జిల్లా ఊలందూరు పేటలోని జోనల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీస్‌ పనిచేస్తోంది. ఇందులో ప్రాథమిక విద్యా కార్యాలయం కూడా ఉంది. ఈ కార్యాలయంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మొదటి సెమిస్టర్‌, 2వ సెమిస్టర్‌, 3వ సెమిస్టర్‌ సహా లక్షల విలువైన పుస్తకాలు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో కార్యాలయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే ఉళుందూరుపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని లక్షల విలువైన పుస్తకాలు, పలు కీలక పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఘటనపై ఉళుందూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌

బాధ్యతల స్వీకరణ

తిరుత్తణి: తిరుత్తణి మున్సిపల్‌ కమిషనర్‌గా కన్నియప్పన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుత్తణి మున్సిపల్‌ ఇన్‌చార్జ్‌ కమిషర్‌గా శివకుమార్‌ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇన్‌చార్జ్‌ కావడంతో తిరుత్తణి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. దీంతో కొత్తగా కమిషనర్‌ను నియమించాలని ప్రభుత్వానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సహా కౌన్సిలర్లు కోరారు. ఈ క్రమంలో కులైచ్చల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కన్నియప్పన్‌ను తిరుత్తణి మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ అధికారులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సరస్వతి, వైస్‌ చైర్మన్‌ సామిరాజ్‌ సహా కౌన్సిలర్లు మున్సిపల్‌ కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తిరువల్లిక్కేణిలో

పెద్ద మసీదు ప్రారంభం

తిరువొత్తియూరు: చైన్నె, తిరువల్లిక్కేణి వాలాజా రోడ్డులోని పెద్ద మసీదు నెల రోజుల తర్వాత కొత్త శోభతో మంగళవారం ప్రారంభమైంది. ఈ మసీదు 1795లో మొగలాయిల పాలనలో ఆర్కాట్‌ యువరాజు పూర్వీకుడైన మహమ్మద్‌ అలీ ఖాన్‌ వాలాజాచే నిర్మించారు. చైన్నెలోని చారిత్రక చిహ్నాల్లో ఒకటిగా ఉన్న ఈ పెద్ద మసీదు 225 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. సంప్రదాయమైన ఈ పురాతన మసీదు ఆర్కాట్‌ యువరాజు నవాబ్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అలీ పర్యవేక్షణలో పునరుద్ధరించి ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement