కేసీజీలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్‌ | - | Sakshi
Sakshi News home page

కేసీజీలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్‌

Mar 5 2026 7:35 AM | Updated on Mar 5 2026 7:35 AM

సాక్షి, చైన్నె: విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయడానికి, డిజైన్‌ ఆలోచనలను ప్రోత్సహించడానికి, స్టార్టప్‌ సంస్కృతిని బలోపేతం చేయడానికి చైన్నెలోని కేసీజీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఏఐసీటీఈ నిధులతో కూడిన ప్రతిష్టాత్మకమైన ఐడియా ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ విద్యా విధానం, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు అనుగునంగా దీనిని తీర్చిదిద్దారు. చైన్నెలోని జపాన్‌ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ మియాతా కెంజి ఈ ల్యాబ్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎథిరాజ్‌ కాలేజ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ మురళీధరన్‌, హిందూస్తాన్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆనంద్‌ జాకబ్‌ వర్గీస్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ అన్నీ జాకబ్‌ , ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ముతుకన్నన్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ల్యాబ్‌ ఏర్పాటుకు మొత్తం రూ. 90 లక్షలు వెచ్చించారు. ఇది ఒక ఉమ్మడి భాగస్వామ్య ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంది. ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ రూ. 30 లక్షలు, కేసీజీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ రూ. 30 లక్షలు. పరిశ్రమ భాగస్వాములు: రూ. 30 లక్షలువెచ్చించారు. ప్రముఖ ఆటోమేషన్‌ సంస్థ ఎఫ్‌ఏఎన్‌యూసీడీ ల్యాబ్‌ సాంకేతిక మద్దతు అందిందింది. ఇది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక సహకారం అందించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement