అన్నానగర్: తేని జిల్లా ఆనైమలైయన్‌పట్టి నివాసి సుధా కరణ్ (51). ఇతను కష్ణగిరి జిల్లాలోని అంజెట్టి తాలూకాలోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 27వ తేదీన తరగతి గదిలో 10 ఏళ్ల 5వ తరగతి విద్యార్థినిని ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీని తర్వాత, విద్యార్థిని తల్లి తేన్ కనికొట్టై ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బుధవారం సుధాకర్‌ను అరెస్టు చేశారు.
తిరువొత్తియూరు: గంజాయి కేసులో పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఆవడి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాలు విక్రయించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పూందమల్లి ప్రాంతాల్లో గంజాయి తరలిస్తున్నట్టు పూందమల్లి ఎకై ్సజ్ ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి సమాచారం అందింది. దీంతో పారివాక్కం శ్మశానవాటిక వద్ద అనుమానాస్పదంగా నిలబడి ఉన్న ఇద్దరు యువకులను ఆపి తనిఖీ చేశారు. వారు గంజాయి రవాణా చేస్తున్నట్టు తెలిసింది. విచారణలో వారు నీలాంగరైకి చెందిన ఆకాష్ (24), త్రిపుర రాష్ట్రానికి చెందిన జాయ్ దేబ్ దాస్ (19) అని, ఇద్దరూ ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి కొనుగోలు చేసి పూందమల్లి, మాంగాడు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరువళ్లూరు: ఆలయం వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యవహరంలో ఆలయ అర్చకుడికి పదేళ్ల జైలుశిక్షను విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా ఎన్నూర్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల చిన్నారి. ఈక్రమంలో గత జనవరి నెలలో పాఠశాల సెలవు రోజు కావడంతో బాలిక స్థానికంగా వున్న బాలసుబ్రమణ్యం స్వామి ఆలయం వద్ద ఆడుకుంటున్న చిన్నారిని అదే గుడిలో పూజారిగా వున్న రాజన్(71) బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన క్రమంలో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. దీంతో పాటు బాధిత బాలికకు రూ.2లక్షలు పరిహారం సైతం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
అన్నానగర్: శివగంగై జిల్లా సమీపంలోని మడపురంలో తిరుప్పువనమ్ ఆలయం ఉంది. గత జూన్‌న్‌లో ఆలయ గార్డు అజిత్‌కుమార్ నగలు దొంగిలించాడని నిఖిత ఫిర్యాదు చేసింది. దీంతో తిరుప్పువనమ్ పోలీసులు అజిత్‌కుమార్‌పై దాడి చేశారు. దాడిలో అజిత్‌కుమార్ మృతిచెందాడు. ఈసంఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి మదురై సెంట్రల్ జైలులో ఉంచారు. ఈక్రమంలో మదురై హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ విచారణ నిర్వహిస్తోంది. ఇటీవల సీబీఐ మదురై జిల్లా కోర్టులో ఈ కేసు గురించి నివేదిక దాఖలు చేశారు. అందులో నికితా తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీపై తప్పుడు ఫిర్యాదు చేసిన నిందితురాలు నికితపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. అజిత్‌కుమార్ హత్య కేసులో నికితను వ్యక్తిగతంగా ప్రశ్నించడానికి అనుమతి కోరుతూ మధురై జిల్లా కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌న్‌ను స్వీకరించిన కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని నిఖితకు నోటీసు పంపింది. బుధవారం ఉదయం మదురై జిల్లా కోర్టులో ఆమె హాజరయ్యారు.
అన్నానగర్: విరుదునగర్ జిల్లా చెందిన రామ్ జీ (20). చెంగల్పట్టు జిల్లాలోని తాళంబూర్ ప్రాంతంలో ఉంటు ఓ ప్రైవేట్ డెంటల్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్నాడు. గత 2 రోజులుగా రామ్ జీ కాలేజీకి వెళ్లడం లేదని తెలుస్తోంది. బుధవారం రామ్ జీ తల్లి ఫోన్ చేసినప్పుడు, అతను ఫోన్ ఎత్తలేదు, దీంతో ఆమె వెంటనే తన స్నేహితులకు సమాచారం ఇచ్చింది. రామ్ జీ స్నేహితులు వెంటనే ఇంటికి వెళ్లినప్పుడు, తలుపు లోపలి నుండి లాక్ చేయబడి ఉండడాన్ని వారు చూశారు. వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి, రామ్‌జీ వంటగదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న తాళంబూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అతని గదిని కూడా సోదా చేసినప్పుడు అతను రాసిన మూడు పేజీల లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో, రామ్ జీ నీట్ చదువుతున్నప్పుడు ఓ మహిళతో ప్రేమలో పడ్డాడని, అకస్మాత్తుగా ఆమె విడిపోయిందని, మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడైంది. తన సూసైడ్ లేఖలో ‘‘నాకు ఉన్న చిన్న ఆనందం నువ్వేనని, నువ్వు లేకుండా నేను ఈ ప్రపంచంలో జీవించాలనుకోవడం లేదు’’ అని రాయడం గమనార్హం.


