తమిళసినిమా: ఐదు కథలతో, ఐదుగురు దర్శకులు తెరకెక్కించిన చిత్రం వోవెల్స్. ఈ తరం యువత ప్రేమ ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని రుద్ది సిద్ది ఫిలిమ్స్ పతాకంపై రాజు షెరేకర్ నిర్మించారు. దిలీప్ కుమార్, సంగీత్, హేమంత్ కుమార్, సంతోష్ రవి, జగన్ రొజేంద్రన్ మొదలగు నలుగురు దర్శకత్వం వహించిన ఇందులో ప్రముఖ నటుడు యూగీ సేతు, చిన్ని జయంత్ ప్రధాన పాత్రలు పోషించగా, నటి సంయుక్త విశ్వనాథన్, రాజ్ అయ్యప్పా,దిపక్ పరమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి శరవణ సుబ్రమణ్యం సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 13వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం చైన్నెలోని కమల థియేటర్లో నిర్వహించారు. నటుడు యూగి సేతు మాట్లాడుతూ ఇది ఈ తరం యువత జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఐదు కథలు చివరికి ఒక చోట కలిసే విధంగా ఐదుగురు దర్శకులు చక్కగా తెరపై ఆవిష్కరించారని పేర్కొన్నారు. ఈ ఐదుగురు దర్శకుల్లో సమైక్యత ఉందన్నారు. ఒక భాగానికి దర్శకత్వం వహించిన దర్శకుడు మరో భాగానికి సహాయ దర్శకుడిగా పని చేశారని చెప్పారు. ఇందులో నటుడు చిన్ని జయంత్, తాను కీలక పాత్రలను పోషించినట్లు చెప్పారు. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా మారిన తొలి మిమిక్రీ ఆర్టిస్ట్ చిన్ని జయంత్ అని పేర్కొన్నారు. మంచి కంటెంట్‌తో ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వోవెల్స్ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.కాగా ఈ చిత్రాన్ని ఉత్రా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత హరి ఉత్రా తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ యూగి సేతు, చిన్ని జయంత్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రానికి పక్కా బలం అన్నారు. ఇటీవల హింసాత్మక సంఘటనల మయంగా వస్తున్న తరుణంలో చక్కని భావోద్రేకాలతో కూడిన వోవెల్స్ వంటి చిత్రం రావడం శుభపరిణామం అన్నారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
శ్రద్ధాకపూర్


