విజయవంతంగా సీనియర్స్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, చైన్నె : కావేరి ఆస్పత్రి, తమిళనాడు సీనియర్స్ టెన్నిస్ క్లబ్ నేతృత్వంలో విజయవంతంగా రెండు రోజుల పాటూ ఓపెన్ టెన్నిస్ టోర్నీ జరిగింది. ఇందులో విజేతలకు సోమవారం బహుమతులను ప్రదానం చేశారు. చైన్నె వైఎంసీఏ మైదానంలోసీనియర్ సిటిజన్ల కోసం ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను శని, ఆదివారాలలో నిర్వహించారు. ఇందులో సుమారు 210 మంది సీనియర్ టెన్నిస్ క్రీడాకారులు ఉత్సాహంగా తమ ప్రతిభను చాటారు. వీరిని 45–50, 50–55, 55–60, 65–70, 70–75 సంవత్సరాల కేటగిరీ వారీగా విభజించి పోటీలను నిర్వహించారు. సింగిల్స్, డబుల్స్‌లలో స్నేహ పూరితంగా మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించారు. విజేతలకు కావేరి ఆస్పత్రి ఆళ్వార్ పేట సీనియర్ ఆర్థో పెడిక్ సర్జన్ డాక్టర్ సింగార వడి వేలు ప్రదానం చేశారు.


