అంగన్‌వాడీ కార్యకర్తల అరెస్ట్
సేలం: ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంగన్‌న్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని, అంగన్‌న్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.9వేలు కుటుంబ పెన్షన్ ఇవ్వాలని, వేసవి సెలవులు కల్పించాలని, ఎన్నికల సమయంలో డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం సహా 9 అంశాలను డిమాండ్ చేస్తూ తమిళనాడు అంగన్‌న్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం ఈరోడ్ రెవెన్యూ జిల్లా కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. వెయ్యి మందికి పైగా అంగన్‌న్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొని తమ డిమాండ్లను పరిస్కరించాలని నినాదాలు చేశారు. తరువాత, వారు తాలూకా కార్యాలయానికి వెళ్లి రాస్తారోకోకు ప్రయత్నించారు. అనుమతి లేకపోవడంతో, ముందస్తు జాగ్రత్త చర్యగా అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు, వెయ్యి మందికి పైగా అంగన్‌న్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను అరెస్టు చేసి కల్యాణ మండపానికి తీసుకెళ్లారు.


