ముగిసిన మార్గళి మహా ఉత్సవాలు
కొరుక్కుపేట: చైన్నె పట్టాభిరామ్‌లోని ధర్మమూర్తిరావు బహదూర్ కలవల కన్నన్ చెట్టి హిందూ కళాశాలలో సీతమ్మ ఫైన్ ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘మార్గళి ఉత్సవ్ 2026’ పేరుతో మూడు రోజులపాటు సంగీత గాన, వాద్య, నృత్యాల ప్రదర్శన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాన్ని ముందుగా కళాశాల కార్యదర్శి ఎం.వెంకటేశ పెరుమాళ్, కళాశాల ప్రధాన అధ్యాపకులు డా.జి.కల్విక్కరసి, సంచాలకులు డా.ఎన్.రాజేంద్రనాయుడు కలసి సంప్రదాయ దీప ప్రజ్వలనతో ప్రారంభించారు. మొదటి రోజున శ్రీనివాసన్ జి.శాసీ్త్రయ వయోలిన్ కచేరీ జరిగింది. రెండవ రోజు కళాశాల పూర్వ విద్యార్థి ఇందిరజిత్ శాసీ్త్రయ గానకచేరీ అలరించింది. కీర్తి స్కూల్ ఆఫ్ డాన్‌న్స్ వారి భరతనాట్యం ఉత్సాహభరితంగా జరిగింది. పదిహేను మంది కళాకారులు పాల్గొని భరతనాట్యంలో అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కళాకారులను సన్మానించారు.


