డీన్ బాధ్యతల స్వీకరణ
తిరువళ్లూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ వైద్యశాల డీన్‌గా మోహనగాంధీ బాధ్యతలు స్వీకరించారు. తిరువళ్లూరు జిల్లాలో గత అన్నాడీఎంకే హయాంలో రూ.384 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి అడ్మిషన్‌లు ప్రారంభించారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన తరువాత మెడికల్ కళాశాల అనుబంధ వైద్యశాలగా తిరువళ్లూరు జిల్లా వైద్యశాలను మార్చారు. ఈ క్రమంలో వైద్యశాల మొట్టమొదట డీన్‌గా అరసి శ్రీవాత్సవ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లపాటు పనిచేశారు. అనంతరం ఆమె ఉద్యోగోన్నతి పొంది చైన్నెలోని ఓమందూరార్ వైద్యశాలకు బదిలీపై వెళ్లి రిటైర్డ్ అయ్యారు. అనంతరం వైద్యశాల రెండవ డీన్‌గా రేవతి బాధ్యతలు స్వీకరించి రెండేళ్లపాటు పదవిలో కొనసాగి గతవారం రిటైర్డ్ అయ్యారు. దీంతో నూతన డీన్ నియామకం అనివార్యంగా మారింది. ఇందులో భాగంగానే ఆర్థో స్పెషలిస్టు మోహనగాంధీ ప్రభుత్వ వైద్యశాల డీన్‌గా నియమితులైన క్రమంలో మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. నూతన డీన్‌కు డాక్టర్ ప్రభుశంకర్, జగదీష్, విజయరాజ్, రాజ్‌కుమార్, యోగేంద్ర అబినందనలు తెలిపారు.


