బాలా, ఐశ్వర్య రజనీకాంత్ కాంబోలో చిత్రం?
తిరువణ్ణామలై
ఆలయంలో
దర్శకుడు బాలాతో కలిసి స్వామి దర్శనం
చేసుకుంటున్న
ఐశ్వర్య
రజనీకాంత్
తమిళసినిమా : నటుడు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈమె నటుడు రజనీకాంత్ పెద్ద కూతురు. నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల తరువాత ఇటీవల ఇద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే. కాగా నుటుడు ధనుష్ , శృతిహాసన్ జంటగా రూపొందిన 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన ఐశ్వర్య రజనీకాంత్ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మంచి పేరునే తెచ్చుకున్నారు. ధనుష్ నుంచి విడాకులు పొందిన తరువాత ఐశ్వర్య రజనీకాంత్ పూర్తిగా సినిమాలపై దృష్టి సారించారు. ఆమె అంతకు ముందు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. చివరిగా తన తండ్రి రజనీకాంత్ అతిథిపాత్రలో నటించిన లాల్ సలామ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. కాగా తాజాగా మరో చిత్రానికి ఐశ్వరర్య రజనీకాంత్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈసారి ఆమె హీరోలను నమ్ముకోకుండా కథను నమ్మి చిత్రం చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్ర కథ విన్న దర్శకుడు బాలా తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించి చర్చించడానికి ఐశ్వర రజనీకాంత్, దర్శకుడు బాలా తిరువణ్నామలైకు వెళ్లినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వారు తిరువణ్ణామాలైలో అరుణాచలేశ్వరస్వామిని దర్శించుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే గత ఏడాది అరుణ్ విజయ్ హీరోగా వణంగాన్ చిత్రాన్ని తెరకెక్కించిన బాలా తాజాగా కొత్త చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధం అయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


