బంగారుగుడి పీఠాధిపతికి వెండివేల్ సమర్పణ
వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి పీఠాధిపతి శక్తిఅమ్మ 50వ జయంతి వైభవాన్ని పురస్కరించుకొని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆరడుగుల వెండివేల్‌ను సమర్పించారు. ముందుగా వేలూరు కోట మైదానంలోని శ్రీ జలకంఠేశ్వరాలయంలో స్వామి దర్శనం చేసుకున్న ఆయన ఆరు అడుగుల ఎత్తుగల వెండివేల్‌కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెండివేల్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లి పీఠాధిపతి శక్తిఅమ్మ వద్ద అందజేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆయనతోపాటు హిందూ మక్కల్ పార్టీ వ్యవస్థాపకులు అర్జున్ సంపత్, బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తియాయిని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దశరథన్, శ్రీపురం బంగారుగుడి డైరెక్టర్ సురేస్‌బాబు, మేనేజర్ సంపత్ ఉన్నారు. ఇదిలా ఉండగా వేలూరుకు వచ్చిన అన్నామలైకి ఆ పారీ కార్యకర్తలు వేలూరులో ఘనస్వాగతం పలికారు.


