అంకితభావంతో పని చేస్తేనే..
తమిళసినిమా: అందరూ అంకిత భావంతో పని చేస్తేనే ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని పూర్తి చేయగలం అన్నారు. నిర్మాత తిలగవతి కరికాలన్. ఈమె గోల్డెన్ గేట్ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్ ఫేమ్ విక్రమన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి సుప్రిత నటిస్తున్నారు. జాన్సన్ దివాకర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి ప్రీతి కరికాలన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్మాత తిలకవతి కరికాలన్ మాట్లాడుతూ ఇది కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. వినోదంతో పాటు కుటంబ అనుబంధాలు తదితర ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు.
ఈ చిత్రం ద్వారా బిగ్‌బాస్ ఫేమ్ విక్రమన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఆయన రొమాంటిక్ కథా పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఒక చిత్రం ప్రణాళిక ప్రకారం పూర్తి కావాలంటే అందుకు అందరూ అంకిత భావంతో కూడిన శ్రమ అవసరం అవుతుందన్నారు. అలా ఈ చిత్రానికి నటీనటులు, దర్శకురాలు, సాంకేతిక వర్గం మొదలగు అందరూ అంకిత భావంతో పని చేయడంతోనే ప్రణాళిక ప్రకారం షూటింగ్‌ను పూర్తి చేయగలిగామని చెప్పారు. అదే విధంగా చిత్ర మార్కెటింగ్, ప్రమోటింగ్ కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు. చిత్ర టైటిల్, టీజర్, ఆడియో, ట్రైలర్ విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత తిలకవతి కరికాలన్ పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. దీనికి శ్రీధర్ ఛాయాగ్రహణం, అజీష్ అశోకన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
అంకితభావంతో పని చేస్తేనే..


