డిమాంటీ కాలనీ–3 ఫస్ట్‌లుక్ విడుదల
తమిళసినిమా: ఒక చిత్రానికి సీక్వెల్ హిట్ అవ్వడమే ఆరుదు. అలాంటిది డీమాంటీ కాలనీ 1,2 చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇప్పుడు వాటికి సీక్వెల్ 3 రూపొందుతోంది. హాలీవుడ్‌లో ది కంజూరింగ్, ది ఈవిల్ డెడ్ వంటి హర్రర్ థ్రిల్లర్ చిత్రాలు ఒకే రకమైన కథా పాత్రలతో రూపొంది ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అదేవిధంగా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు హర్రర్ నేపథ్యంలో ఇంతకుముందు తెరకెక్కించిన డీమాంటీ కాలనీ అనూహ్య విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్‌గా రూపొందించిన డీమాంటీ కాలనీ 2 చిత్రం అంతకు మించి సక్సెస్ అయ్యింది. దీంతో తాజాగా డీమాంటీ కాలనీ 3 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇంతకుముందు చిత్రాల్లో నటించిన అరుళ్ నిధి, ప్రియాభవాని శంకర్‌లే ఈ చిత్రంలోనూ నాయకీ నాయకులుగా నటిస్తున్నారు. దీన్ని ఫ్యాషన్ స్టూడియోస్ పతాకంపై సుదన్ సుందరం నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుదన్ సుందరం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ నూతన సంవత్సరం డిమాంటీ కాలనీ 3తో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు అజియ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ నిర్మాత సుదన్ సుందరం ఈ చిత్రం విషయంలో ఏ విధంగానూ కలగజేసుకోకుండా తనకు పూర్తి స్వేచ్చనిచ్చారన్నారు. డిమాంటీ కాలనీ 1,2 చిత్రాలు బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చి పెట్టడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పారు.ఈ చిత్ర షూటింగ్‌ను 2025 జూలై నెలలో ప్రారంభించి 2026లో పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.


