విజయ్ వైపు అన్నాడీఎంకే మాజీల చూపు
– సెంగొట్టయన్‌తో కృష్ణన్ భేటీ
సాక్షి, చైన్నె: విజయ్ టీవీకే వైపుగా అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు, అసంతృప్తి నేతలు దృష్టి మరల్చారు. సెంగొట్టయన్‌ను ఆదివారం ఓమలూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణన్ కలిశారు. ఆయన త్వరలో టీవీకేలో చేరనున్నారు. అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగొట్టయ్యన్ ఇటీవల టీవీకేలో చేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీ వర్కింగ్ కమిటీ కన్వీనర్‌గా, కొంగు మండలం ఇన్‌చార్జ్ గాసెంగొట్టయ్యన్ వ్యవహరిస్తున్నారు. త్వరలో అన్నాడీఎంకే నుంచి టీవీకే వైపుగా క్యూ కట్టే వాళ్లు పెరుగుతారని సెంగొట్టయ్యన్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న వాళ్లు ఎక్కువే. మళ్లీ సీటు దక్కుతుందన్న ఆశతో ఉన్నవాళ్లు మరీ ఎక్కువే. వీరంతా పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి ప్రసన్నంలో ఉన్నారు. పళణి తమను నిరాకరించినా, తమ సిట్టింగ్ సీట్లు బీజేపీ, ఇతర కూటమి పార్టీలకు కేటాయించినా టీవీకేలోకి జంప్ అయ్యేందుకు అనేక మంది తాజా, మాజీ ఎమ్మెల్యే ఎదురుచూపులలో ఉన్నారు. ఈ పరిస్థితులలో ఓమలూరు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే కృష్ణన్ టీవీకే కన్వీనర్ సెంగొట్టయ్యన్‌తో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఈయన బాటలో కొంగు మండలంలో ఉన్న మాజీలందరూ ఒకటి రెండు రోజులలో విజయ్ సమక్షంలో టీవీకే కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తదుపరి సిట్టింగ్‌లు అనేక మందితోపాటూ ముఖ్య నేతలు క్యూ కట్టే అవకాశాలు ఎక్కవే అని సెంగొట్టయ్యన్ మద్దతుదారులు పేర్కొంటుండడం గమనార్హం.
ఆర్తుపాళయం వంతెనకు
సి.సుబ్రమణ్యం పేరు
సాక్షి, చైన్నె: కోయంబత్తూరులోని ఆర్తుపాళయం నుంచి ఉక్కడం వరకు హైలెవల్ ఫ్లైఓవర్‌కు సి. సుబ్రమణ్యం పేరును పెట్టేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇటీవల కాలంగా ఆయా నగరాల లో రూపుదిద్దుకుంటున్న వంతెనలకు అక్కడి దివంగతులైన స్వాతంత్య్ర సమరయోధులు, పె ద్దల పేర్లను పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీ వల కోయంబత్తూరులో బ్రహ్మాండ వంతెనకు జీడీ నాయుడు పేరు, మదురైలో వీరనారి వేలునాచ్చియార్ పేర్లను పెట్టారు. తాజాగా కోయంబత్తూరు లో ఆర్తుపాళయం నుంచి ఉక్కడం జంక్షన్ వరకు ఒప్పనక్కర రోడ్డుకు భారత రత్న సి.సుబ్రమణ్యం పేరును ఖరారు చేస్తూ సీఎం స్టాలిన్ శనివారం ప్రకటించారు. కేంద్ర మంత్రిగా హరిత విప్లవానికి తోడ్పాటు అందించిన భారతరత్న సి.సుబ్రమణ్యంకు ఇదే తాము ఇస్తున్న గౌరవమని, ఆయన ఘన కీర్తిని చాటుతామన్నారు.
పంజరంలో చిలుక విజయ్
–సెల్వకుమార్ వ్యాఖ్య
సాక్షి, చైన్నె: టీవీకేలో విజయ్ కేవలం పంజరంలో చిలుక అని ఆయన మాజీ మేనేజర్ సెల్వకుమార్ వ్యాఖ్యానించారు. త్వరలో టీకే నుంచి 20కు పైగా జిల్లాలకు చెందిన కార్యదర్శులు, ముఖ్య నేతలు బయటకు రానున్నారని వివరించారు. ఇటీవల విజయ్‌ను వీడి ఆయన మేనేజర్ సెల్వకుమార్ డీఎంకేలో చేరిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయ్ పంజరంలో చిలుక అని వ్యాఖ్యానించారు. ఈ చిలుకను ఆడించే వాళ్లు వేరే వ్యక్తులు ఉన్నారని, ఇది తమిళనాడుకు తీవ్ర అన్యాయం తలపెట్టే బృందం అని ఆరోపించారు. పంజరంలో ఉన్న చిలుకలను అప్పుడుప్పుడు స్వేచ్ఛగా బయటకు వదిలినట్టుగా విజయ్‌ను ప్రచార కార్యక్రమాలకు ఆ బృందం పంపిస్తున్నదన్నారు. విజయ్ వారి అడుగులకు మడుగులు వత్తుతున్నారని త్వరలో ఆయన పంజరం చిలుక వ్యవహారానికి మరిన్ని సమాధానాలు వస్తాయన్నారు. సంక్రాంతిలోపు ఆ పార్టీలో జిల్లాల కార్యదర్శులుగా ఉన్న 20 మందికి పైగా నేతలు, వారి అనుచరులు, ముఖ్య నిర్వాహకులు టీవీకే నుంచి బయటకు రానున్నారన్నారు.
బీమా రంగంలో వ్యూహాత్మక మార్పు
సాక్షి, చైన్నె: బీమా రంగంలోకి విప్లవాత్మక మార్పులు 2025లో చోటుచేసుకుందని నివా బుఫా హెల్ ఇన్సూరెన్స్ ఎండీ కృష్ణన్ రామచంద్రన్ తెలిపారు. 2025 ముగింపు దశలో బీమా పరిశ్రమ ప్రగతి గురించి ఆదివారం ఆయన మీడియాకు వివరించారు. అభివృద్ధి చెందుతున్న అంశాలు, రెండు చారిత్రాత్మక పరిణామాలతో మార్పులు తప్పలేదన్నారు. ఇందలో మొదటిది ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద ,ప్రయాణ బీమా వంటి అంశాలు ఉన్నాయన్నారు. రెండవది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 74 నుంచి 100 శాతం పెంచడమేనని వివరించారు. ఆర్థిక చేరికలు మరింత పెంచడానికి, దీర్ఘకాల విస్తృత ప్రయత్నాలలో భాగంగా టర్మ్ క్యాపిటల్ ఆవిష్కరణలను అన్ లాక్ చేస్తుందని భావిస్తున్నామన్నారు. ఆరోగ్య బీమా పరిశ్రమ నిరంతర వృద్ధి దిశగా, స్వతంత్య్ర ఆరోగ్య బీమా సంస్థలు ప్రీమియంలో గత సంవత్సరంతో పోల్చితే తాజాగా 10.4 శాతం బలమైన వృద్ధిని నమోదు చేశాయని వివరించారు.
విజయ్ వైపు అన్నాడీఎంకే మాజీల చూపు


