తెలుగులో చిత్రాలకు మంచి ఆదరణ
త్రిఖంణ చిత్ర ఆడియోను ఆవిష్కరించిన దర్శకుడు కేబుల్ శంకర్‌తో యూనిట్ సభ్యులు
తమిళసినిమా: మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం త్రిఖంణ. ఎస్‌వీఎం స్టూడియోస్ పతాకంపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్న బాహు భాషా చిత్రం ఇది. మణి తెల్లగుట్టీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించారు శ్రద్ధాదాస్, సాహితీ అవాంస హీరోయిన్లుగా నటించారు. కల్లూరి రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రాజేశ్వర్, షాజిత్ కలిసి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. ఈ వేదికపై చిత్ర నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఇంతకుముందు మూడు తెలుగు చిత్రాలు నిర్మించినట్లు చెప్పారు. ఇది తన తొలి తమిళ చిత్రం అని చెప్పారు. ఈ చిత్రాన్ని తమిళంలోనూ. నిర్మించడానికి కారణం కుమరిక్కండం, పూర్వీక తమిళులు అంటూ తమిళ ప్రజలకు కనెక్ట్ అయ్యే కథాంశంతో సాగే చిత్రం ఇది అని చెప్పారు. దీన్ని తమిళం, తెలుగు,హిందీ భాషల్లో రూపొందించినా, ఇటీవల చిన్న హీరోలు నటించిన చిత్రాలు మంచి విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ చిత్రంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా ఎంపిక చేసినట్లు చెప్పారు. దర్శకుడు మణి తెల్లగుట్టీ మాట్లాడుతూ ఇది మైథలాజికల్ నేపధ్యంలో క్రైమ్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నటుడు మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఇందులో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు.తాను తెలుగులో వరుసగా మూడు చిత్రాల్లో నటించడానికి కారణం అక్కడ ప్రజలు చిత్రంలు చూడటానికి ధియేటర్లకు రావడమేనన్నారు. అందుకే తెలుగులో విజయాల శాతం అధికంగా ఉంటోందన్నారు. తమిళనాట చిన్న చిత్రాలకు థియేటర్లే లభించడం లేదన్నారు. తాను భవిష్యత్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది మహేంద్రన్ పేర్కొన్నారు.
తెలుగులో చిత్రాలకు మంచి ఆదరణ


