కోలీవుడ్‌కు మరో హీరోయిన్
దీవ్రా హరన్
తమిళసినిమా: సినీ పరిశ్రమ నూతన ప్రతిభావంతులైన కథానాయికల కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. అదేవిధంగా సినిమాల్లో నటించాలని, తమ ప్రతిభను చాటుకోవాలని, ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాలని చాలామంది నవ నాయికలు ఆశ పడుతూనే ఉంటారు. అయితే అందరికీ ఆశ నెరవేరుతుందా అన్నది చెప్పలేం. అందుకు ఆశతోపాటు, అదృష్టం తోడవ్వాలి. అలా తాజాగా నవ నటి దీవ్రాహరన్‌కు కథానాయికిగా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అయితే ఈమె ఇప్పటికే మోడలింగ్ రంగంలో రాణిస్తుంది. టైంలో సినీ పరిశ్రమ దృష్టిలో పడ్డారు. అలా ఈ బ్యూటీ కథానాయికిగా నటించిన తొలి చిత్రం రెట్టతల. అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. ఈ భామ అచ్చ తమిళ్ యువతి అన్నది గమనార్హం. మాన్ కరాటే, గెత్తు చిత్రాల ఫేమ్ క్రిష్ తిరుకుమరన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం రెట్టతల. అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని బీటీజీ పతాకంపై బాబీ బాలచందరన్ నిర్మించారు. ఈచిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని దీవ్రాహారన్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, ఇందులో నటించడం మంచి అనుభవం అని చెప్పారు. ఈ చిత్రం తరువాత మరిన్ని అవకాశాలు వస్తున్నాయని , వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని, నటనకు అవకాశం ఉన్న వాటికి ప్రాముఖ్యతనిస్తానని దీవ్రా హరన్ తెలిపారు.


