రాధిక ప్రధాన పాత్రలో ‘తాయ్ కిళవి’
తమిళసినిమా: వైవిధ్య భరిత కథ చిత్రాలను నిర్మించడంలోనూ, టాలెంటెడ్ కళాకారులను ప్రోత్సహించడంలోనూ ముందుండే నటుడు శివ కార్తికేయన్ ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం తాయ్ కిళవి. ఈ చిత్రం ద్వారా శివ కుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లను శుక్రవారం విడుదల చేశారు చిత్ర దర్శకుడు శివకుమార్ మురుగేశన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తను దర్శకుడు మణికంఠన్ శిష్యుడినని చెప్పారు. ఈ చిత్ర కథలు నటుడు సౌకర్ వినగానే తాను అనుకున్న నటినటులను ఎంపిక చేసుకుని చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కించడానికి అనూహ్య బడ్జెట్లో నిర్మించారని పేర్కొన్నారు. ఉసిలంపట్టి గ్రామం కట్టుబాటులో నివసించే 75 ఏళ్ల బామ్మ నేపథ్యంతో రూపొందిస్తున్న కథాచిత్రం ఇదని చెప్పారు. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, సమస్యలు తదితర అంశాలకు వినోదాన్ని జోడించి తెరకెక్కించినట్లు చెప్పారు. ఇందులో రాధిక శరత్ కుమార్‌తో పాటూ నటుడు సింగం పులి, అరుళ్ దాస్, బాలా శరవణన్, నటి రేయ్చ్చల్ రెబోకా, మునీశ్ కాంత్,ఇళవరసు తదితరులు ముఖ్యపాత్రులు పోషించినట్లు చెప్పారు. చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతాన్ని, వివేక్ విజయరాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. తాయ్ కిళవి చిత్రం జనరంజకంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.


