వెబ్ ప్రపంచంలోకి విక్రాంత్
తమిళసినిమా: కథానాయకుడిగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు విక్రాంత్. ఈయన ఇప్పుడు వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. విక్రాంత్ కథానాయకుడిగా నటించిన వెబ్ సీరీస్ ఎల్బీడబ్ల్యూ. లవ్ బియాండ్ వికెట్. ఇది జియో హాట్ స్టార్ ఓటీటీ సంస్థ ప్రసారం చేస్తున్న ఒరిజినల్ వెబ్ సీరీస్ అన్నది గమనార్హం. ఈ సంస్థ ఇంతకుముందు హార్ట్‌బీట్, పోలీస్ పోలీస్, ఆఫీస్ వంటి వెబ్ సీరీస్‌లను రూపొందించిందన్నది గమనార్హం. హార్ట్‌బీట్ సీరీస్‌ను నిర్మించిన అట్లి ఫ్యాక్టరీ తాజాగా నిర్మించిన వెబ్ సీరీస్ ఎల్బీబ్ల్యూ. క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన అంశాలతో కూడిన వెబ్‌సీరీస్ ఇది. రంగన్ క్రికెట్ క్రీడాకారుడు తన సాధించడంలో విఫలం అవుతాడు. ఆ తరువాత అకాడమీ శిక్షకుడిగా బాధ్యతలను నిర్వహిస్తూ క్రికెట్ క్రీడలో జయించడానికి పోరాడే మరోజట్టు బాధ్యతలను తనపై వేసుకుంటాడు. అలా అతను ఆ జట్టును విజయపథంలోకి తీసుకెళ్తాడా లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఉత్కంఠ భరితంగా సాగే ఇతివృత్తంతో రూపొందించిన ఈ వెబ్ సీరీస్ నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.


