వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోండి
తిరువళ్లూరు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో తపాల కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కుమార్, కార్మిక సంఘాలకు చెందిన నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. కుమార్ మాట్లాడుతూ గతంలో కార్మికుల కోసం 29 ప్రత్యేక చట్టాలు వుండేవని, అయితే వాటిని విలీనం చేసి నాలుగు కొత్త చట్టాలను అమలు చేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే చట్టాలను వెనక్కి తీసుకుని పాత విధానాన్ని అమలు చేయాలని కోరారు. అనంతరం తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో 20 మంది మహిళలు సహా 105 మందిని అరెస్టు చేశారు.
వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోండి


