ఎయిడ్స్ నివారణపై అవగాహన పోటీలు
కొరుక్కుపేట: యువతలో ఎయిడ్స్ నివారణపై అవగాహన పెంచుతూ నిర్వహించిన పోటీల్లోని విజేతలకు అన్ననగర్ ఎమ్మెల్యే మోహన్ బహుమతులు అందజేశారు. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసీడబ్ల్యూఓ), రెడ్ రిబ్బన్ క్లబ్ (ఆర్‌ఆర్‌సీ), సి. కందస్వామి నాయుడు కాలేజ్ ఫర్ మెన్, సి. కందస్వామి నాయుడు కాలేజ్ అలుమ్ని అసోసియేషన్, ది మెక్యరీ ఫీనిక్స్ ట్రస్ట్– యూకే మద్దతుతో, ఇంటర్–కాలేజియేట్ ఎయిడ్స్ పాటలు, నృత్య పోటీని డిసెంబర్ 23, 2025న చైన్నెలోని అన్నానగర్‌లో నిర్వహించింది. గాన సంగీత , నృత్యం అనే సృజనాత్మక మాద్యమం ద్వారా కళాశాల విద్యార్థులలో ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని లయన్‌న్స్ క్లబ్ ఆఫ్ చైన్నె గోల్డెన్ ఫ్రెండ్స్ వ్యవస్థాపకుడు సెల్వక్‌కుమార్, సి. ప్రిన్సిపల్ ల్ డాక్టర్ వీఎం ముత్తురామలింగ ఆండవర్ ప్రారంభించారు. బహుమతుల ప్రదానోత్సవలో అన్నానగర్ ఎమ్మెల్యే ఎం.కె. మోహన్, తమిళనాడు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్. సీతాలక్ష్మి, జీవీఎన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్‌పర్సన్ జీవీఎన్ కుమార్, వేలూరులోని నరువి హాస్పిటల్స్ వైద్య విద్య డైరెక్టర్ , ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ మథాయ్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఐసీడబ్ల్యూఓ కార్యదర్శి హరిహరన్ పాల్గొన్నారు.


