మొగిలి ఘాట్‌లో లారీ బోల్తా
బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ వద్ద సోమవారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కాగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోలారు నుంచి చైన్నెకి అల్యూమినియం రాడ్లను తరలిస్తున్న లారీ మొగిలి ఘాట్ వద్దకు రాగానే అదుపు తప్పి రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన రైలింగ్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కాలికి గాయమైంది. రహదారిపై లారీ బోల్తాపడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రహదారిపై బోల్తాపడిన లారీని క్రేన్ సహాయంలో రోడ్డు పక్కకు తొగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మొగిలి ఘాట్‌లో లారీ బోల్తా


