అదితి మదన్ కుమార్ భరతనాట్య అరంగేట్రం
కొరుక్కుపేట: తేజస్విని రాజ్ శివజ్యోతి నృత్య అకాడమీ శిష్యులు, యూకేలోని ఎలిఫెంటైన్ డైరెక్టర్ అదితి మదన్‌్ కుమార్ చైన్నెలో భరతనాట్యం ఆరంగేట్రం చేశారు. దీనికి మైలాపూర్‌లోని రసిక రంజనీ సభ వేదికై ంది. మనోహరమైన భరతనాట్య ఆరంగేట్రాన్ని అందించి సంగీత కళా ప్రియులను మైమరిపించింది. ఆమె నృత్యానికి నట్టువంగం పై టి.ఎమ్.టి. గాయత్రి రాజాజీ, మృదంగంపై బాలస్కందన్, గాత్రంను విఘ్నేష్ రవిచంద్రన్, వయోలిన్ పై శిఖామణి, వీణపై అనంత నారాయణన్ వాద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కలైమామణి మధురై ఆర్. మురళీధరన్ ముత్తు కుమార్, రమణన్ బాలగంగాధరన్ హాజరయ్యారు. భరతనాట్య కళాకారిణి, అపారమైన ప్రతిభ, వివిధ ముద్రలు, హావభావాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నాట్యకారిణి అదితి మధన్‌కుమార్‌ను, గురువును ఘనంగా సత్కరించారు.


