సీనియర్ తమిళ రచయిత అరుగో మృతి
తిరువొత్తియూరు: తమిళ సీనియర్ రచయిత డాక్టర్ అరుగో అలియాస్ అరు. గోపాలన్( 88) మంగళవారం మరణించారు. తమిళనాడు సార్వభౌమాధికారం, బ్రాహ్మణ వ్యతిరేక, ద్రావిడ వ్యతిరేకత, తమిళ ఈలం విముక్తి కోసం ఆయన పోరాడారు. చైన్నెలోని కోడంబాక్కంలో నివాసం ఉంటున్న ఇతను తన ఇంటిలో మృతి చెందారు. డాక్టర్ అరుగో క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. డాక్టర్ అరు.గోపాలన్ 11.1.1937న శంకరన కోవిల్‌కు చెందిన అరుణాచలం – గోమతి అమ్మాల్ దంపతులకు జన్మించారు. ఈయనకు భార్య కళ్యాణి. కుమారులు మదన్, తమిళసెల్వన్ ఉన్నారు. కాగా సి.పా.ఆదిత్యనార్ నామ్ తమిళర్ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, ఆయనతో కలిసి అరుగో పనిచేశారు. తమిళక్కొడి పత్రికకు సంపాదకుడిగా కూడా పనిచేశారు.
చైన్నెలో 979 శిబిరాలు
సాక్షి, చైన్నె: చైన్నెలో ఓటరు శిబిరాలు విస్తృతం కానున్నాయి. జనవరి 18వ తేదీ వరకు 979 శిబిరాలు కొనసాగనున్నాయి. ఇక్కడ నమూనా జాబితాలో పేర్లు గల్లంతైన వాళ్లు మళ్లీ తమ పేర్లను నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. చైన్నె జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ 40 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఎస్‌ఐఆర్ ద్వారా 15 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటర్ల పేర్లు చైన్నెలోనే గల్లంతయ్యాయి. అత్యధికంగా చిరునామా గుర్తించ లేని పరిస్థితి ఉండడంతో తాజాగా పేర్లు గల్లంతైన వారి కోసం ఇక్కడి ఎన్నికల అఽధికారులు ప్రత్యేక శిబిరాలపై దృష్టి పెట్టారు. ఎవరెవరు జాబితాలో లేకుండా ఉన్నాయో, వారికి అవకాశం కల్పించే విధంగా శిబిరాలను ఏర్పాటు చేశారు. శని, ఆదివారం శిబిరాలు ఏర్పాటు చేయాలని భావించినా, ఇక, బుధవారం నుంచి జనవరి 18వ తేదీ వరకు శిబిరాలు కొనసాగనున్నాయి. కొత్త ఓటర్లు సైతం తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలు కల్పించే విధంగా అన్ని రకాల దరఖాస్తులను 979 శిబిరాలలో సిద్ధం చేశారు.
క్రిస్మస్ వేడుకలు
సాక్షి, చైన్నె: తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) నేతృత్వంలో పులియాంతోపు డాన్‌బాస్కో క్యాంపస్ ఆవరణలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్, ప్రధాన కార్యదర్శి జీఆర్ వెంకటేష్, నేతలు పాల్గొన్నారు. మైలై శాంతోమ్ మాజీ ఆర్చ్ బిషప్ ఎఎం చిన్నప్ప కేక్ కట్ చేసి, క్రైస్తవులకు కానుకలను అందజేశారు.
చైన్నె సంగమం
సాక్షి, చైన్నె: సంక్రాంతి ( పొంగల్) వేడుకలలో భాగంగా తమిళాభివృద్ధి, సమాచార శాఖ నేతృత్వంలో చైన్నె సంగమం– నమ్మ ఊరు ఉత్సవం నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో మంగళవారం మంత్రి స్వామినాథన్ సమావేశమయ్యారు.
ఎన్నికల్లో పోటీకి
9 వేల దరఖాస్తులు
కొరుక్కుపేట: తమిళనాడులో 2026 ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేశాయి. పొత్తులపై చర్చించడానికి, చర్చలు జరపడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకే తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే వారు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ మేరకు 15వ తేదీ నుంచి అన్నాడీఎంకేలో నామినేషన్ పత్రాల పంపిణీ ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు చైన్నె రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో తమ దరఖాస్తులను అందజేశారు. ఈ పరిస్థితిలో ఎన్నికలో పోటీ చేయడానికి దరఖాస్తును సమర్పించడానికి మంగళవారం చివరి రోజు కావడంతో ప్రధాన కార్యాలయంలో 1,000 మందికి పైగా దరఖాస్తులను సమర్పించారు. అన్నాడీఎంకే పార్టీ తరఫున పోటీ చేయడానికి 9 వేలకు పైగా ప్రజలు తమ దరఖాస్తులను సమర్పించారు.
సీనియర్ తమిళ రచయిత అరుగో మృతి


