వార్ రూమ్‌కు విజయ్
సాక్షి, చైన్నె: ఎన్నికల పనులను ఇక వార్ రూమ్ నుంచి విజయ్ వేగవంతం చేయించనున్నారు. బుధవారం నందనంలోని వార్ రూమ్ నుంచి జిల్లాల కార్యదర్శులతో సమీక్షలకు తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ సిద్ధమయ్యారు. టీవీకే బలోపేతం లక్ష్యంగా విజయ్ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితుల గురించి సమీక్షించేందుకు చర్యలు చేపట్టారు. విజయ్ నందనంలో వార్ రూమ్‌ను ఇటీవల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచే పార్టీ వర్గాలకు అన్ని రకాల సమాచారాలు సందేశాలను పంపించడం జరుగుతుంది. విజయ్ పార్టీ వ్యవహారాలన్నీ డిజిటల్ మయం అన్న విషయం తెలిసిందే. నేతలందరికి సైతం డిజిటల్ కార్డులను అందజేసి ఉన్నారు. ఓ వైపు మీట్ ది పీపుల్ పేరిట ప్రచార సభలకు ఏర్పాట్లను ఇక విస్తృతం చేయడమే కాకుండా, పార్టీ పరంగా పూర్తి స్థాయిలో వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించే దిశగా బుధవారం నుంచి వార్ రూమ్‌లో విజయ్ తిష్ట వేయనున్నారు. ఇక్కడి నుంచి జిల్లాల కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో విజయ్ సమీక్షలకు, సమావేశాలు నిర్వహించనున్నారు.
విజయ్ కారును అడ్డుకున్న మహిళా నేత
పనయూరులోని నివాసం నుంచి విజయ్ మంగళవారం ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి బయలు దేరారు. మార్గం మధ్యలో ఆయన కారును హఠాత్తుగా ఓ మహిళ అడ్డుకుంది. దీంతో కలకలం రేగింది. భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. తొలుత ఆమె పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడి భద్రతా సిబ్బంది పంపించేయడంతో కారుకు అడ్డు పడినట్టు తేలింది. ఆమె తూత్తుకుడికి చెందిన అజితా అగ్నేస్‌గా గుర్తించారు. ఆది నుంచి పార్టీకి సేవ చేస్తున్న తనకు జిల్లా కార్యదర్శి పదవి దక్కక పోవడంతో ఆమె విజయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు తేలింది.
విజయ్


