మోడల్ పాఠశాలలు ప్రారంభం
యువ పోలీసు అధికారులు
చైన్నె ఈరోడ్ మధ్య
నాగర్‌కోయిల్ స్పెషల్ ట్రైన్
తిరువొత్తియూరు: క్రిస్మస్, నూతన సంవత్సర వరుస సెలవుల కారణంగా ప్రధాన మార్గాల్లో నడిచే రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో దక్షిణ రైల్వే స్పెషల్ రైళ్లను ప్రకటించి నడుపుతోంది. ఇందులో భాగంగా, ఈరోడ్ నుంచి సేలం, కాట్పాడి, చైన్నె, తిరుచ్చి, మదురై, తిరునెల్వేలి మీదుగా నాగర్‌కోయిల్‌కు స్పెషల్ రైలు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈరోడ్–నాగర్‌కోయిల్ స్పెషల్ రైలు (06025) (23వ తేదీ), 30వ తేదీన అందుబాటులో ఉంటుందన్నారు. ఈరోడ్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, సేలానికి సాయంత్రం 5 గంటలకు చేరుకుని, జోలార్‌పేట, కాట్పాడి, అరక్కోణం, పెరంబూర్, చైన్నె ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విలుప్పురం, వృద్ధాచలం, తిరుచ్చి, దిండిగల్, మదురై, విరుదునగర్, సాత్తూర్, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి, నాంగునేరి, వల్లీయూర్ మీదుగా నాగర్‌కోయిల్‌కు మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, నాగర్‌కోయిల్–ఈరోడ్ స్పెషల్ రైలు (06026) బుధవారం రోజు (24వ తేదీ), 31వ తేదీన నడుస్తుంది. నాగర్‌కోయిల్‌లో రాత్రి 11 గంటలకు బయలుదేరి, తిరునెల్వేలి, మదురై, తిరుచ్చి, విలుప్పురం, చైన్నె ఎగ్మోర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట మీదుగా సేలానికి మరుసటి రోజు సాయంత్రం 5.27 గంటలకు చేరుకుని, ఈరోడ్‌కు రాత్రి 8.30 గంటలకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలుకు టిక్కెట్ బుకింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
సాక్షి, చైన్నె: సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం సచివాలయంలో బిజీ అయ్యారు. రూ. 210.17 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ పాఠశాలల భవనాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే రూ. 19.72 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలు, లైబ్రరీ భవనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక మైలాడుతురైలో రూ. 4.40 కోట్లతో చేపట్టనున్న జిల్లా కేంద్రం గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వ్యయంతో కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. విల్లుపురం, కడలూరు, చెంగల్పట్టు, కోయంబత్తూరు, ధర్మపురి, దిండిగల్, కన్యాకుమారి, కృష్ణగిరి, మైలాడుతురై, నాగపట్నం, సేలం, తంజావూరు, నీలగిరి, తిరువారూర్, తిరుచ్చి, వేలూరు,విరుదునగర్ జిల్లాలో 60 మోడల్ స్కూల్స్ భవనాలను అన్ని రకాల ఆధునిక హంగులతో నిర్మించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు ఏవీ వేలు, అన్బిల్ మహేశ్, సీఎం మురుగానందం, విద్యాశాఖ కార్యదర్శి చంద్ర మోహన్ తదితరులు హాజరయ్యారు.
పుస్తకావిష్కరణ..
అనంతరం జరిగిన కార్యక్రమంలో హిందీ వ్యతిరేక నిరసన – పూర్తి ప్రభుత్వ పత్రాలు పేరిట రూపొందించిన పుస్తకాన్ని సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. రచయిత ఎ. వెనిల సిద్ధం చేసిన ఈ పుస్తకాన్ని సీఎం విడుదల చేయగా, మంత్రి తంగం తెన్నరసు అందుకున్నారు. ఈ పుస్తకంలో హిందీ వ్యతిరేక ఉద్యమం, నిరసనలు, 1967 కాలం నాటి పరిస్థితులు, వంటి అంశాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, టి. ఉదయచంద్రన్, తమిళనాడు ఆర్కైవ్స్ , చారిత్రక పరిశోధన విభాగం కమిషనర్ , ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హర్ సహాయ్ మీనా, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, డాక్టర్ పి. శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఐపీఎస్ శిక్షణ ముగించుకుని యువ అధికారులు తమిళనాడులో విధులకు సిద్ధమయ్యారు. ఇక్కడ విధులలో చేరడానికి వచ్చిన యువ ఐపీఎస్ అధికారులను సీఎం స్టాలిన్ ఆహ్వానించి, తన ఆశీస్సులు అందజేశారు. వీరిలో తొమ్మిది మందియువ అధికారిణులు ఉండటం విశేషం. సచివాలయంలో వీరంతా సీఎం స్టాలిన్ ను కలిశారు. అనంతరం పోలీసు శాఖ, అగ్నిమాపక , రక్షణ శాఖ, జైళ్లు శాఖలో రూ. 43.91 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలు, 9 కొత్త పోలీస్ స్టేషన్ భవనాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన మరో మూడు స్టేషన్లను కూడా ప్రారంభించారు. కొత్తగా ఉత్తర మేరూర్, వేలంకన్ని, పల్లి పాళయంలలో పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే, పోలీసులకు క్వార్టర్లును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్‌కుమార్, పోలీసు ప్రధాన కార్యాలయం డీజీపీ(ఇన్‌చార్జ్) అభయ్‌కుమార్ సింగ్, అగ్నిమాపక డైరెక్టర్ సీమా అగర్వాల్, పోలీసు హౌసింగ్, జైళ్లు, అగ్నిమాపక శాఖ అధికారులు వినీత్, దేవ్ వాంఖాడే, దేవ్ వాంఖడే, డాక్టర్ మహేశ్వర్ దయాళ్, తదితర అధికారులు హాజరయ్యారు.అనంతరం వివిధ శాఖల అధికారులతో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ సమావేశమయ్యారు. వివిధ పథకాల తీరు తెన్నుల గురించి చర్చించారు.
మోడల్ పాఠశాలలు ప్రారంభం
మోడల్ పాఠశాలలు ప్రారంభం


