కే–కేసీసీఎస్‌తో వీఎంఆర్‌ఎఫ్‌ ఒప్పందాలు | - | Sakshi
Sakshi News home page

కే–కేసీసీఎస్‌తో వీఎంఆర్‌ఎఫ్‌ ఒప్పందాలు

Nov 26 2025 6:15 AM | Updated on Nov 26 2025 6:15 AM

కే–కేసీసీఎస్‌తో వీఎంఆర్‌ఎఫ్‌ ఒప్పందాలు

కే–కేసీసీఎస్‌తో వీఎంఆర్‌ఎఫ్‌ ఒప్పందాలు

సాక్షి, చైన్నె: జపాన్‌లో భవిష్యత్‌ను నిర్మించుకోవాలన్న ఆశతో ఉన్న విద్యార్థుల కోసం జపనీస్‌ భాషా విద్య, ప్రపంచ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు , కెరీర్‌ మార్గాలను బలోపేతం చేయడానికి వినాయక మిషన్స్‌ రీసెర్చ్‌ పౌండేషన్‌(వీఎంఆర్‌ఎఫ్‌) చర్యలు చేపట్టింది. ఇందుకోసం కే –కేసీసీఎస్‌ ఇండియాతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్థానికంగా జరిగిన ఈ ఒప్పందాల కార్యక్రమంలో కేసీసీఎస్‌ ఇండియా ఎండీ కరుణానిధి, వీఎంఆర్‌ఎఫ్‌ డిప్యూటీ రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ పి రాజశేఖరన్‌లు సంతకాలు చేశారు. జపనీస్‌ భాషా నైపుణ్య అభివృద్ధి, భారత్‌ – జపాన్‌లలో పరిశ్రమ ఇంటర్న్‌ షిప్‌లను సులభతరం చేయడం, జపాన్‌ ఆధారిత ఉపాధికి ప్లేస్‌ మెంట్‌మద్దతు, జపనీస్‌ విశ్వ విద్యాలయాలలో ఉన్నత విద్యా పురోగతికి మార్గాలు,స్కాలర్‌ షిప్‌ మార్గదర్శకత్వం, మద్దతు, విశ్వవిద్యాలయంం– పరిశ్రమ సహకార కార్యక్రమాలు ఈ ఒప్పందాల మేరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌ఎఫ్‌ బోర్డు ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యుడు జే సురేష్‌ శామ్యూల్‌, సైంటిఫిక్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి సెల్వకుమార్‌, సీఐఆర్‌ హెడ్‌ లక్ష్మీ మోహన్‌, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ అవకాశాలను విస్తృతంచేసే భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు రెండు సంస్థలను ఆ విద్యా సంస్థ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఏఎస్‌ గణేషన్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement