క్లుప్తంగా
హిజ్రాకు అరుదైన చికిత్స
సాక్షి, చైన్నె : నియోవాజినల్ ద్వారా మలం లీకేజీని ఆపడం కోసం ఓ ట్రాన్స్ జెండర్(హిజ్రా)కు అరుదైన చికిత్సను ఎస్‌ఆర్‌ఎం ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతం చేశారు. వినూత్న ఎండోస్కోపిక్ విధానంలో బోవిన్ పెరికార్డియల్ ప్యాచ్‌ను ఉపయోగించారు. 22సంవత్సరాల లింగమార్పిడి చేసుకున్న యువకుడికి అరుదైన రెక్టో నియోవాజినల్ ఓపెనింగ్ ద్వారా మల విసర్జన్ ఆపేందుకు పెద్ద ప్రేగును అనుసంధానించే మార్గాన్ని మూసి వేయడానికి బోవిన్ పెరికార్డియల్ ప్యాట్, క్లిప్ ఉపయోగించి ఎండోస్కోపిక్ క్లోజర్‌ను విజయవంతం చేశామని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సి పాల్ దిలీప్‌కుమార్ తెలిపారు. క్లినికల్ లీడ్ డాక్టర్ అరుల్ ప్రకాష్, డాక్టర్ తరుణ్ జే జార్జ్‌లతో కూడిన బృందం రోగికి ప్రధాన ఓపెన్ – అబ్జామినల్ సర్జరీ అవసరాన్ని నివారించడంలో సహాయ పడే విధంగా చికిత్సను అందించారు. ఈ రోగి కొన్ని నెలల క్రితం ఒక ఆస్పత్రిలో లింగ నిర్ధారణ శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు, ఈ ప్రక్రియ తర్వాత రెక్టో –నియోవాజినల్ ఫిస్టులా అభివృద్ధి చెందడం కారణంగా సమస్య బయలు దేరినట్టు డాక్టర్ అరుల్ ప్రకాశ్ వివరించారు. సాధారణంగా ఈకేసులో ఓపెన్ అబ్డామినల్ సర్జరీని ఏకై క ఎంపిగాపరిగణించడం జరుగుతుందని, అయితే, ఎక్కువ ఖర్చు, ఎక్కువ కాలం ఆస్పత్రిలోఉండాల్సి రావడం వంటి అంశాలను పరిగణించి తాము ఈ కొత్త విధానంలో చికిత్సను విజయవంతం చేశామన్నారు.
నవవధువు ఆత్మహత్య
అన్నానగర్: శివగంగై జిల్లాలోని కరైకుడి ప్రాంతానికి చెందిన ముత్తు (30). చైన్నెలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. తిరుచ్చిలోని తిల్లైనగర్ కి చెందిన విశాలాక్షి (28)తో ఈ ఏడాది సెప్టెంబర్ 11న వివాహం జరిగింది. వివాహం తర్వాత, నూతన వధూవరులు చైన్నెలోని ముత్తు ఇంట్లో నివసించారు. ఈ క్రమంలో గత రెండున్నర నెలలుగా చైన్నెలో నివసిస్తున్న విశాలాక్షి, ఈనెల 19వ తేదీన తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. చైన్నెలో నివసించడం తనకు ఇష్టం లేదని చెప్పింది. ఈ స్థితిలో, సోమవారం విశాలాక్షి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చైన్నెలో నివసించడం ఇష్టం లేకపోవడంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
వేలూరు: వేలూరు కలెక్టరేట్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఓ మహిళ కలెక్టరేట్‌లోని ఏ బ్లాక్‌కు వచ్చి పోర్టిగోలో నిలిచింది. ఉన్న ఫలంగా తను బ్యాగులో తెచ్చుకున్న కిరోసిన్‌ను శరీరంపై పోసుకొని నిప్పు పెట్టుకునేందుకు పయత్నించింది. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు ఆమెను గమనించి వెంటనే అడ్డుకొని శరీరంపై నీటిని పోశారు. అనంతరం ఆమె వద్ద పోలీసులు విచారణ జరపగా వేలూరు సమీపంలోని కనసాల్‌పేట ప్రాంతానికి చెందిన రాజేశ్వరి అని తెలియవచ్చింది. ఇంటి పక్కన ఉన్న ఓ వ్యక్తి తన వీడియో తీసి రూ. లక్ష డిమాండ్ చేసి బెదిరిస్తున్నట్లు వీటిపై ఇది వరకే వేలూరు నార్త్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అనంతరం ఆమె కుమారుడి వద్ద పోలీసులు విచారణ జరపగా ఆమెకు మతి స్థిమితం లేకుండా వచ్చిందని చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అనంతరం రాజేశ్వరిని ఆమె కుమారుడితో పంపివేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రైవేట్ సంస్థ ఉద్యోగి వద్ద దోపిడీ
నలుగురు యువకుల అరెస్ట్
తిరువొత్తియూరు: ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తి వద్ద నగలు, సెల్‌ఫోన్ అపహరించిన నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తండయార్‌పేట నేతాజీ నగర్ 5వ వీధికి చెందిన నవీన్‌కుమార్ (38) ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. ఈనెల 2వ తేదీ రాత్రి పని ముగించుకుని ఆర్.కె.నగర్–మనాలి రోడ్డులో నడుచుకుంటూ వచ్చి, అక్కడ నిలిపి ఉంచిన ఆటోలో నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామున లేచి చూసుకోగా, మెడలో ఉన్న 19 గ్రాముల బంగారు గొలుసు, 2 సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు తెలిసింది. దీనిపై నవీన్‌కుమార్ ఆర్.కె.నగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి కొడుంగయ్యూర్ ప్రాంతానికి చెందిన బాలాజీ (23), కొరుక్కుపేట ప్రాంతానికి చెందిన సతీష్ (28)లను సోమ వారం అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు, కొరుక్కుపేటకు చెందిన అనుష్ (22), తండయార్‌పేటకు చెందిన సూర్యకుమార్ (25)లను సోమ వారం అరెస్టు చేశారు. వారి నుంచి 19 గ్రాముల బంగారు గొలుసు, 2 సెల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సతీష్‌పై 3 కేసులు, సూర్యకుమార్‌పై 3 కేసులు ఉన్నట్లు తెలిసింది.
క్లుప్తంగా


