రెండు టైటిల్స్ ఆవిష్కరణ
ఒకేసారి
నింజా చిత్ర టైటిల్‌ను ఆవిష్కరించిన సినీ ప్రముఖులు
తమిళసినిమా: విజయవంతమైన, జాతీయ అవార్డును గెలుచుకున్న పార్కింగ్ చిత్రాన్ని నిర్మించిన సోల్జర్స్ ఫిలిం ఫ్యాక్టరీ అధినేత కె ఎస్.సినీష్ తాజాగా రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఒకటి అర్జున్‌దాస్ కథానాయకుడిగా నటిస్తున్న సూపర్ హీరో చిత్రం. తేజు అశ్విని నైతిక నటిస్తున్న ఈ చిత్రంలో రెడిన్ కింగ్స్‌లీ ముఖ్యపాత్రను పోసిస్తుండగా, డాన్‌న్స్ మాస్టర్ శాండీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సినీష్‌తో కలిసి చాలాకాలంగా పనిచేసిన విఘ్నేష్ వేణుగోపాల్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. అబ్దుల్‌వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈచిత్రానికి సంజన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా కేఎస్ సినిష్ లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్‌న్స్ అధినేతలు సాయి దేవానంద్, ఎస్ సాయి వెంకటేశ్వరన్‌లతో కలిసి నిర్మిస్తున్న మరో చిత్రం నింజా. సాయి దేవానంద్ ఎస్ సాయి వెంకటేశ్వర ఇంతకుముందు జమా, వే టు హోమ్ చిత్రాలను నిర్మించారు. తాజాగా పా రంజిత్ వహిస్తున్న వెట్టువమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నింజా చిత్రానికి మురుగ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భారత్ హీరోగా నటిస్తున్నారు. దీనికి జీవీ. ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాల టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. శివకార్తికేయన్, దర్శకుడు నా.రంజిత్ సూపర్ హీరో చిత్ర టైటిల్‌ను ఆవిష్కరించగా,, దర్శకుడు వెంకట్ ప్రభు, నెల్సన్ నింజా చిత్ర టైటిల్ ఆవిష్కరించారు. ఆర్య, కవిన్, సందీప్‌కిషన్, రియోరాజ్, మిర్చిశివ, ప్రాంక్‌స్టార్ రాహుల్, కలైయరసన్, కౌశిక్, దర్శకుడు రవికుమార్, అభిషన్ జీవింత్, డాన్ శాండీ, శ్రీ గణేష్, ఆదక్ రవిచంద్రన్, పచ్చముత్తు తమిళం రోషన్, పీౠస్, మడోన్ అశ్విన్, రత్తన శివ, సతీష్, రామ్ కుమార్ బాలకృష్ణన్, కార్తీక్, నితిన్ స్వామినాథన్, వినోద్ రాజ్ పాల్గొన్నారు.
రెండు టైటిల్స్ ఆవిష్కరణ


