ఫస్ట్ లుక్ విడుదల
ద్రౌపది–2 హీరోయిన్
తమిళసినిమా: దర్శకుడు మోహన్.జీ తెరకెక్కించిన చిత్రం ద్రౌపతి. రిచర్డ్ రిషి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 2020లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఐదు ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ద్రౌపది 2 చిత్రం రూపొందుతోంది. దీన్ని మోహన్.జీ నే దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజీ ప్రొడక్షనన్స్ సంస్థతో కలిసి జీఎం ఫిలిం కార్పొరేషన్ అధినేత చోళ చక్రవర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి రక్షణ నాయకిగా నటించారు. నట్టి నటరాజన్, వైజీ.మహేంద్రన్, నాడోడిగళ్ భరణి, శరవణ సుబ్బయ్య, వేల రామమూర్తి ,సిరాజ్ జానీ, దినేష్ లంబ, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పద్మా చంద్రశేఖరన్, మోహన్.జీ సంభాషణలను రాసిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని ఫిలిప్ ఆర్ సుందర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ద్రౌపది – 2 చిత్రంలో హీరోయిన్ రక్షణ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ యూనిట్ వర్గాలు విడుదల చేశారు. సంప్రదాయం, గంభీరం ఉట్టి పడేలా ఉన్న ఆమె ఫస్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్ శ్రీ శక్తికి నిదర్శనం గా నిలుస్తూ, ఈ చిత్రం 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక ఘటనల నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో ఉద్రేక భరితంగా కథ, కథనాలు సాగుతుందన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయనీ, అదేవిధంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను మొదలెట్టినట్లు చెప్పారు.


