
టీపీఎల్ 3.ఓ టైటిల్ విజేతగా ఇండియన్ బ్యాంక్
సాక్షి,చైన్నె: తిరువళ్లూరు ప్రీమియర్ లీగ్(టీపీఎల్) 3.ఓ టోర్నమెంట్ టైటిల్‌ను ఇండియన్ బ్యాంక్ కై వసం చేసుకుంది. తిరువళ్లూరులో నిర్వహించిన నువో క్లినిక్ తిరువళ్లూరు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) 3.0 హాకీ గ్రాండ్ ఫినాలే ఎగ్మోర్‌లోని ఎస్‌డీఏటీ మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఫైనల్స్‌లో బ్యాంకర్స్ డెర్బీ ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పోటీ పడ్డాయి. తిరువళ్లూరు ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ లీగ్ ఇండియన్ బ్యాంక్ 4 గోల్స్‌తో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ను 3 గోల్స్‌తో ఓడించింది. దీంతో ఇండియన్ బ్యాంక్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకుంది. గతనెల 11 నుండి 31 వరకు నిర్వహించిన లీగ్‌లో 10 జట్లు పాల్గొన్నాయి, ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.ఎం.నాజర్, ఎగ్మోర్ ఎమ్మెల్యే పరంధామన్, హాకీ తిరువళ్లూరు జట్టు అధ్యక్షుడు డాక్టర్ ప్రకాష్ అయ్యదురై, పద్మశ్రీ ఒలింపియన్ వి.భాస్కరన్, ఒలింపియన్లు మొహమ్మద్ రియాజ్ తిరుమల్వలవన్, ప్రభాకరన్ (ఇండియన్ ఇంటర్నేషనల్), మొహమ్మద్ మునీర్ (ఎఫ్‌ఐహెచ్ అధికారి), ిసీఆర్ కుమార్(భారత కోచ్) హాజరై విజేతలకు ట్రోఫీలు, బహుమతులను అంద జేశారు. విజేతగా ఇండియన్ బ్యాంక్ జట్టు ట్రోిఫీని కైవసం చేసుకోగా, రన్నరప్‌గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, మూడోస్థానాన్ని పైస్ అగోర్క్ జట్టు నిలిచాయి.