బందోబస్తు నడుమ వినాయక నిమజ్జన ఊరేగింపు | - | Sakshi
Sakshi News home page

బందోబస్తు నడుమ వినాయక నిమజ్జన ఊరేగింపు

Aug 30 2025 7:38 AM | Updated on Aug 30 2025 7:38 AM

బందోబ

బందోబస్తు నడుమ వినాయక నిమజ్జన ఊరేగింపు

వేలూరు: వినాయక చతుర్థిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శుక్రవారం ఉదయం పటిష్ట పోలీస్‌ బందోబస్తు నడుమ సాగింది. వేలూరు జిల్లాలో రెండు వేల వినాయక విగ్రహాలు ప్రతిష్టించేందుకు అనుమతి ఇచ్చారు. వేలూరులో అక్కడక్కడ ఉంచిన విగ్రహాలను సదుప్పేరి చెరువులో నిమజ్జనం చేసేందుకు శుక్రవారం ఉదయం పోలీసులు అన్ని ఏర్పాట్లును సిద్ధం చేశారు. అలాగే కాట్పాడిలో ప్రతిష్టించిన విగ్రహాలకు లత్తేరి, వీఐటీ వెనుక వైపున ఉన్న చెరువులో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో వేలూరులో కొలువుదీర్చిన విగ్రహాలను వేలూరు సత్‌వచ్చారి కలెక్టరేట్‌ సమీపంలోని ఆంజనేయ ఆలయం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీపురం బంగారుగుడి డైరెక్టర్‌ సురేష్‌ జెండా ఊపి, ఊరేగింపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణి ఆస్పత్రి డైరెక్టర్‌ బాలాజీ, అప్పాజీ స్వాములు, అప్పు పాల అధినేత బాలాజీ మొదలియార్‌, హిందూ మున్నాని రీజినల్‌ అధ్యక్షుడు మహేష్‌, జిల్లా కోశాధికారి భాస్కరన్‌ కలిసి ఊరేగింపును ప్రారంభించారు. కాగా ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ మయిల్‌వాగనన్‌ అధ్యక్షతన రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటితో పాటు డ్రోన్‌ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచారు. అనంతరం ఊరేగింపు సాయినాథపురం మురుగన్‌ ఆలయం, ఆర్కాడు రోడ్డులో మకాన్‌ సిగ్నల్‌ దాటుకుని సదుప్పేరికి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఊరేగింపు సందర్భంగా మసీదులు వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలో కూడా పటిష్ట బందోబస్తు నడుమ నిమజ్జనం చేశారు.

సేలం ముక్కునేరిలో వినాయకుని నిమజ్జనం

సేలం: వినాయగర చతుర్థి రోజున, ప్రతిష్టించిన విగ్రహాలను ఇళ్లు, సంస్థల్లో పూజలు చేసిన తర్వాత నీటి వనరుల్లో నిమజ్జనం చేయడానికి వాహనాల్లో తీసుకెళ్లారు. సేలం లోని ముక్కునేరిలో పోలీసు రక్షణలో ఈరోజు విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.

బందోబస్తు నడుమ వినాయక నిమజ్జన ఊరేగింపు1
1/2

బందోబస్తు నడుమ వినాయక నిమజ్జన ఊరేగింపు

బందోబస్తు నడుమ వినాయక నిమజ్జన ఊరేగింపు2
2/2

బందోబస్తు నడుమ వినాయక నిమజ్జన ఊరేగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement