
చెన్నై: 2024 జూన్‌లో బంగారం అక్రమ రవాణా సంఘటన జరిగింది. ఇది తీవ్ర సంచలనం సృష్టించింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన దర్యాప్తులో రూ.167 కోట్ల విలువైన 267 కిలోల బంగారాన్ని దుబాయ్ సహా విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేశారని తేలింది. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, కస్టమ్స్ విభాగం ఇంకా ప్రధాన నిందితుడిని అరెస్టు చేయలేదు. నిందితుడు విదేశాల్లో పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. ఈకేసులో ఒక్క గ్రాము బంగారం కూడా స్వాధీనం చేసుకోలేదు. ఏడాది అవుతున్నా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోనట్లు కనిపిస్తోంది.