
వినూత్న ఆవిష్కరణలతో శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కొరుక్కుపేట: వినూత్న ఆవిష్కరణలతో భవిష్యత్‌లో అబ్దుల్ కలాం, థామస్ అల్వా ఎడిషన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎస్‌కేడీటీ పాఠశాలలు, ఏఐటీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. చైన్నె విల్లివాక్కంలోని ఎస్‌కేడీటీ మహోన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సైన్‌న్స్ ఫెయిర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ పోటీల్లో 15 పాఠశాలల నుంచి 700 మందికి పైగా విద్యార్థులు పాల్గొని 40 ప్రదర్శనలతో తమ నైపుణ్యాలను చాటుకున్నారు. డాక్టర్ సీఎంకే రెడ్డి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా పాల్గొన్న నార్త్ చైన్నె డీఈఓ ఏఎస్ ఎలిల్ అరసి అంతర్ పాఠశాలల సైన్‌న్స్ ప్రదర్శన పోటీలను ప్రారంభించారు. సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా పాఠశాల కార్యదర్శి, కరస్పాండెంట్ డాక్టర్ సీఎం కిషోర్ హాజరయ్యారు. ఈ పోటీల్లో ఎంపికై న నీటి శుద్ధీకరణ, విమాన ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించే పరికరం, భూ ప్రకంపనలను పసికట్టే పరికరం, మానవ జీవితంలో రోబో పాత్రను రూపొందించిన విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేసి /్ఞాపికలు, ప్రశంస పత్రాలను అందజేశారు. ఆర్.నందగోపాల్, డాక్టర్ ఎన్.నాగభూషణం, హెచ్‌ఎం శారా సుహాసిని, టీచర్లు పాల్గొన్నారు.

వినూత్న ఆవిష్కరణలతో శాస్త్రవేత్తలుగా ఎదగాలి