
రాజ్ అయ్యప్ప హీరోగా నూతన చిత్రం ప్రారంభం
తమిళసినిమా: రాజ్ అయ్యప్ప ఎం కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా రాజన్ రవి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిస్టర్ ఫిక్చర్స్ స్టూడియో పతాకంపై ఆర్.జయ లక్ష్మి ఈ చిత్రాన్ని గంటారా స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో నటి శ్రితారావ్ నాయకిగా నటిస్తున్నారు. మోడలింగ్ రంగంలో పాపులర్ అయిన ఈమె కొన్ని చిత్రాల్లోనూ నటించారు. కాగా ప్రేమ్‌జీ, శ్రీనాథ్, సౌందర్య శరవణన్, సీబీ.జయకుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌కుమార్ చాయాగ్రహణం, బాలా సుబ్రమణియన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర పూజా కార్యక్రమాల్లో ఎక్‌ట్రా మదియళగన్ ముఖ్యఅతిథిగా పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది థ్రిల్లింగ్ కథాంశంతో కూడిన జనరంజక కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని చెప్పారు. ఇందు లో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.