టార్గెట్‌ పెరియస్వామి! | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ పెరియస్వామి!

Aug 17 2025 6:29 AM | Updated on Aug 17 2025 6:29 AM

టార్గెట్‌ పెరియస్వామి!

టార్గెట్‌ పెరియస్వామి!

● మంత్రి ఇళ్లు, కార్యాలయాలల్లో ఈడీ సోదాలు ● క్వార్టర్స్‌లోకి ప్రవేశం ● హద్దులు మీరడంతో కేసు నమోదు

సాక్షి, చైన్నె : ఎన్‌పోర్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వర్గాలు గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఐ. పెరియస్వామిని టార్గెట్‌ చేశాయి. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టుగా లభించిన సమాచారాలతో దిండుగల్‌, చైన్నె, మదురైలలోని మంత్రి నివాసాలు, కార్యాలయాలు, కుమారుడు, కుమార్తె నివాసాలు,కార్యాలయాలలో శనివారం విస్తృతంగా సోదాలలో నిమగ్నమయ్యారు. సీఆర్‌పీఎఫ్‌ భద్రత నడుమ పొద్దుపోయే వరకు కొన్ని చోట్ల సోదాలు జరగ్గా, మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. వివరాలు.. మనీ లాండరింగ్‌ పేరిట తరచూ రాష్ట్రంలో ఈడీ సోదాలు విస్తృతంగా జరుగతున్న విషయం తెలిసిందే. డీఎంకేలో ఇది వరకు మంత్రులుగా ఉన్న పొన్ముడి, సెంథిల్‌ బాలాజీతో పాటూ పలువుర్ని ఈడీ టార్గెట్‌చేసి సోదాలు నిర్వహించింది. ఈ పరిస్థితులలో తాజాగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఐ. పెరియస్వామిని టార్గెట్‌ చేశారు. గతంలో దాఖలైన ఓ కేసుకు సంబంధించి మనీ లాండింగ్‌ జరిగినట్టుగా లభించిన ఆధారాలతో తాజాగా మంత్రిని ఈడీ టార్గెట్‌చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. చైన్నె, మదురై, దిండుగల్‌లలోని మంత్రి నివాసాలు, కార్యాలయాలలో సోదాలు జరుగుతున్నాయి. దిండుగల్‌లోని మంత్రి నివాసం వద్దకు పెద్ద ఎత్తున డీఎంకే వర్గాలు తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎక్కడక్కడ డీఎంకే వర్గాలు నిరసనకు దిగడంతో సీఆర్‌పీఎఫ్‌ భద్రత నడుమ సోదాలు చేపట్టాల్సి వచ్చింది. అలాగే, మంత్రి తనయుడు, ఎమ్మెల్యే సెంథిల్‌కుమార్‌ నివాసం, కార్యాలయాలోనూసోదాలు జరుగుతున్నాయి. మంత్రికుమార్తె ఇంద్రాణి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. దిండుగల్‌నివాసంలోకి నోట్లను లెక్కించేందుకు ఉపయోగించే పరికరాలను అధికారులు తీసుకెళ్లడం గమనార్హం.

ఈడీపై కేసు నమోదు

ఈడీ సోదాలతో డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పనిలో పడ్డాయి. అదే సమయంలో చైన్నెలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి నిబంధనలు ఉల్లంఘించి ఈడీ వర్గాలు దూకుడుగా దూసుకెళ్లాయి. దీంతో వ్యవహారం పోలీసులకు చేరింది. అసెంబ్లీ కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో ఈడీ వర్గాలపై చైన్నె ట్రిప్లికేన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కొన్ని చోట్ల సోదాలు పొద్దుపోయే వరకు జరగ్గా, మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. కాగా ఈ దాడులపై డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతి స్పందిస్తూ, ఓటు చోరీ గురించి కేంద్రాన్ని డీఎంకే తీవ్రంగా నిలదీస్తూ వస్తున్న నేపథ్యంలో తమను బెదిరించే విధంగా కక్ష సాధింపు ధోరణితో ఈ దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. తాము ఈడీకి, మోడీకి భయ పడబోమని స్పష్టం చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ, డీఎంకే వర్గాలపై కక్ష సాధింపు దోరణి కేంద్రానికి కొత్తమీ కాదని, వారికి ఏదేని సమస్య వస్తే, తమ వాళ్లను టార్గెట్‌ చేసి ఈడీ ద్వారా సోదాలు చేయించడం పరిపాటిగామారిందని మండిపడ్డారు.

పొటో: 22

మంత్రి పెరియస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement