
ఏజీఎస్ ఖాతాలో లోకా చాప్టర్–1
లోకా చాప్టర్–1లో
నజ్లెన్,
కల్యాణి
ప్రియదర్శన్
తమిళసినిమా: దుల్కర్ సల్మాన్ తన వేఫారర్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన చిత్రం లోకా చాప్టర్–1. ఇది ఆయన నిర్మించిన 7వ చిత్రం కావడం గమనార్హం. కల్యాణి ప్రియదర్శన్, నజ్లెన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి టోమిక్ అరుణ్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్సల్‌గా తెరకెక్కిన తొలి చిత్రం ఇది అని దర్శకుడు పేర్కొన్నారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా నటించినట్లు చెప్పారు. పలు భాగాలుగా రూపొందనున్న సినిమాటిక్ యూనివర్సల్‌లో ఇది తొలిభాగం అని చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ టీజర్‌లను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన రావడంతో పాటు చిత్రంపై భారీ అంచనాలను ఏర్పరచాయని చెప్పారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడనటువంటి కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం అని దర్శకుడు తెలిపారు. ఇందులో చందు సలీంకుమార్, అరుణ్ కొరియన్, శాంతి బాలచంద్రన్ ముఖ్యపాత్రలు పోషించారని చెప్పారు. జాక్స్ బిజాయ్ సంగీతాన్ని, నిమీష్ రవి చాయాగ్రహణం అందించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఏజీఎస్ సంస్థ పొందిందని తెలిపారు. చిత్రం ఓనం పండుగ సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన తెరపైకి రానుందని, లోకా చాప్టర్–1 చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఎపిక్ (ఈపీఐక్యూ) థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి.

ఏజీఎస్ ఖాతాలో లోకా చాప్టర్–1