
డీఎంకే ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలోనే పలు మహిళా సంరక్షణ పథకాలు అమలు అవుతున్నాయని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి పరిధిలోని తిరువలం గ్రామంలో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాలు పూర్తి అయిన వృద్దులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం పథకాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, వృద్ధుల కోసం తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతోంన్నారు. మన రాష్ట్రంలోనే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫన్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. అదే విధంగా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిస్కరించేందుకు మీతో స్టాలిన్ పథకాన్ని ప్రవేశ పెట్టామని తెలిపారు. ఇటువంటి పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. రేషన్ బియ్యం పంపిణీ పథకం ప్రతి నెలా రెండవ శని, ఆదివారాల్లో రేషన్ దుకాణం సేల్స్‌మన్ ఇంటికి వద్దకే వచ్చి పంపిణీ చేస్తారన్నారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ వేలూరు జిల్లాలో మొత్తం 699 రేషన్ దుకాణాలున్నాయని, వీటిలో మొత్తం 27,187 రేషన్ కార్డులున్నాయన్నారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, కాట్పాడి యూనియన్ చైర్మన్ వేల్‌మురుగన్, వైస్ చైర్మన్ శరవణన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● మంత్రి దురైమురుగన్