
నిర్మాణంలో వున్న బ్రిడ్జిని ఢీకొన్న కారు
పళ్లిపట్టు: పళ్లిపట్టు సమీపంలో నిర్మాణ దశలో వున్న బ్రిడ్జిని కారు ఢీకొన్న ప్రమాదంలో 9 మాసాల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలైన మరో ముగ్గురు ఆస్పత్రిలో తీవ్ర చికిత్స పొందుతున్నారు. పళ్లిపట్టు పోలీసుల కఽథనం మేరకు చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలంలోని గోవిందరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సురేంద్రరెడ్డి కుటుంబానికి చెందిన విశ్వనాథన్(50), అతని భార్య రేఖ(35), చిట్ట్టెమ్మ(52) ఆమె కూతురు కీర్తి(25) కీర్తి 9 నెలల చిన్నారి సాన్విక్, పద్మ(60) సహా ఆరుగురు కారులో మంగళవారం తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకునేందుకు కారులో వెళ్లారు. కారును విశ్వనాథన్ నడిపారు. చిత్తూరు– తచ్చూరు ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఆ రోడ్డులో కారు వస్తుండగా, పళ్లిపట్టు సమీపంలోని తిరుమలరాజుపేట వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని కారు అతి వేగంగా ఢీకొంది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈప్రమాదంలో కారులో ప్రయాణించిన పద్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిది. చిన్నారి సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల సాయంతో రాణిపేటలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ 9 నెలల చిన్నారి సాన్విక్, కారు నడిపిన విశ్వనాఽథ్ ప్రాణాలు కోల్పోయారు. కీర్తి, చిట్ట్టెమ్మ చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమాచారంతో పళ్లిపట్టు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి మురుగన్ ఆలయంకు వెళ్తూ కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.
ఒకే కుటుంబానికి చెందిన
ముగ్గురు ఆంధ్రావ ాసుల మృతి

నిర్మాణంలో వున్న బ్రిడ్జిని ఢీకొన్న కారు

నిర్మాణంలో వున్న బ్రిడ్జిని ఢీకొన్న కారు