
నావలర్, చెలియన్ సేవలు చిరస్మరణీయం
కొరుక్కుపేట: డాక్టర్ నావలర్, ఇరా చెలియన్‌ల సేవలు చిరస్మరణీయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. వీఐటీ చైన్నె ప్రాంగణంలో నావలర్ –చెలియన్ ఫౌండేషన్ –2025 ఆధ్వర్యంలో డాక్టర్ నావలర్, ఇరా చెలియన్ అవార్డుల ప్రదానోత్స వ కార్యక్రమం ఘనంగా జరిగింది. వీఐటీ చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమానికి ఎం.వెంకయ్యనాయు డు పాల్గొని డాక్టర్ నావలర్ అవార్డును వరల్డ్ తమిళ్ కన్ ఫెడరేషన్ అధ్యక్షుడు పళా నెడుమారన్‌కు, ఇరా చెలియన్ అవార్డును కేంద్ర మాజీ విద్యాశాఖా మంత్రి డాక్టర్ కరణ్ సింగ్ కు అందజేశారు. ముందుగా డాక్టర్ విశ్వనాథన్ అధ్యక్షోపన్యాసం చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ విద్యావేత్తగా సమాజానికి ఎంతో లబ్ధిచేకూరుస్తున్నారని అభినందించారు. నావలర్, చెలియన్ సేవలను కొనియాడారు. వీఐటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వం, యూఎస్‌ఏ మెడికల్ ప్రాక్టీసనర్ డాక్టర్ జానకీరామన్, ఫౌండేషన్ నిర్వాహకులు ఆర్ వీరమణి ,విమల, మాజీ మంత్రి ఎన్ నళ్లుస్వామి పాల్గొన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఘనంగా వీఐటీలో అవార్డుల ప్రదానం